1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
  4. Chickpeas: Health benefits and nutritional information

బరువు పెరగాలా? రోజూ ఓ కప్పు ఉడకబెట్టిన శెనగలు ఆరగించండి...

Chickpeas
ఎన్నో పోషకాలు కలిగిన చిరుధాన్యాల్లో శెనగలు ఒకటి. వీటిలో ఫోలేట్, మాంగనీస్, ప్రొటీన్, ఫైబర్‌లు పుష్కలంగా ఉంటాయి. అందుకే శెనగలను చాలామంది ఇష్టపడి తింటుంటారు. ముఖ్యంగా ఉడకబెట్టుకుని లాగించేస్తుంటారు. అయితే ప్రతి రోజూ ఉడకబెట్టిన శెనగలను ఓ కప్పు ఆరగించడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. అవేంటో ఇపుడు తెలుసుకుందాం. 
 
* ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో శెనగలను భాగం చేసుకోవడం వల్ల కేన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.
 
* మహిళల్లో రుతుక్రమ సమయంలో వచ్చే సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
 
* సన్నగా ఉండేవారు రోజూ వీటిని ఆరగించడం వల్ల త్వరితగతిన బరువు పెరిగే అవకాశం ఉంది. శరీరంలో కూడా కొవ్వు పెద్దగా పేరుకునిపోదు.
 
* శెనగలను క్రమం తప్పకుండా ఆరగించడం వల్ల శరీరానికి కావాల్సిన ప్రోటీన్‌, ఫైబ‌ర్ అందుతాయి. షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్‌లో ఉంటాయి.
 
* అలాగే, మలబద్దకం, గ్యాస్, అసిడిటీ వంటి జీర్ణ సంబంధ సమస్యలు కూడా తగ్గిపోతాయి.
 
* శెనగలు తినడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గిపోతుంది. ఫలితంగా గుండె జబ్బులు దరిచేరవు.
 
* రక్త హీనత సమస్యతో బాధపడేవారు ఉడకబెట్టిన శెనగలను తినడం వల్ల రక్తం బాగా తయారవుతుంది. ఎముక‌లు, దంతాలు దృఢంగా మారుతాయి. 
తర్వాతి కథనం
భోజనాంతరం తాంబూలం తింటే..? ఎప్పుడు తినకూడదో తెలుసా?