చాలా మంది మలబద్దకం సమస్యతో బాధపడుతుంటారు. దీనికి పచ్చి బఠాణీలతో చెక్ పెట్టొచ్చు. సాధారణంగా వీటిని అనేక రకాల కూరల్లో వేస్తుంటాం. కుర్మా, బిర్యానీ వంటివాటిల్లో ఎక్కువగా వాడుతుంటాం. ఇవి వేయడం వల్ల కూరకు చక్కని రుచి వస్తుంది. అలాగే, ఎన్నో పోషకాలను కూడా కలిగి ఉంటాయి. వీటిని మనం తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే దాంతో శరీరానికి చక్కని పోషణ అందుతుంది. పలు అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి....