సంబంధిత వార్తలు
- అమ్మా క్యాంటీన్లలో రుచికరమైన ఆహారం అందించండి.. సీఎం విజయ్ ఆదేశాలు
- Seiyaan: శివకార్తికేయన్, కమల్ హాసన్ చిత్రం సెయాన్ నేడు ప్రారంభం
- విజయ్ సీఎం అయితే నాకు అసూయ ఎందుకు, అతడు నాకంటే 25 ఏళ్లు చిన్నవాడు: రజినీకాంత్
- ఆరు నెలల్లో టీవీకే ప్రభుత్వం కుప్పకూలిపోతుంది : డీఎంకే ఎమ్మెల్యే జోస్యం
- Chiru158: తన 158వ సినిమా బాబీ కొల్లి కాంబినేషన్ లో ప్రారంభిస్తున్నానని ప్రకటించిన చిరంజీవి
సీఎం విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు : ఎంకే స్టాలిన్
తమిళనాడు రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన టీవీకే ప్రభుత్వం ఏ క్షణమైనా కూలిపోవచ్చని, అందువల్ల మళ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని డీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పిలుపునిచ్చారు. విజయ్ సారథ్యంలోని ప్రభుత్వం ఎపుడైనా కూలిపోవచ్చని, పార్టీ శ్రేణులు ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావాలని ఆయన కోరారు.
పార్టీ జిల్లా కార్యదర్శుల సమావేశంలో మాట్లాడుతూ స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఓటమి తాత్కాలికమేనని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చని అన్నారు. 2029 లోక్‌సభ ఎన్నికలతో పాటు ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఆ ఎన్నికల్లో డీఎంకే ఖచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. తమిళనాడులో సూర్యుడు (డీఎంకే గుర్తు) ఎప్పటికీ అస్తమించడు అని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి స్టాలిన్ బాధ్యత వహించారు. ఓటమికి గల కారణాలు విశ్లేషించి, ప్రజల నుంచి ప్రత్యక్ష అభిప్రాయాన్ని సేకరించేందుకు 36 మంది సభ్యులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేశారు.
