1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Effect of Corona on Earth Movements

భూ కదలికలపైనా కరోనా ప్రభావం

Corona
కరోనాతో కలుగుతున్న నష్టాన్ని సైతం శాస్త్రవేత్తలు తమ ప్రయోగాలకు వినియోగిస్తున్నారు. ప్రపంచదేశాలన్నీ లాక్ డౌన్ అమలుచేస్తున్న వేళ భూమిపై శబ్ద తీవ్రత తగ్గిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇది భూకంప శాస్త్రవేత్తలకు ఓ అవకాశాన్ని ఇచ్చిందని, తక్కువ స్థాయి ప్రకంపనలపై పరిశోధనలు చేసేందుకు వీలు కలిగిందని అభిప్రాయపడుతున్నారు. కరోనా వైరస్ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవన శైలిని పూర్తిగా మార్చివేసింది.

ఈ మహమ్మారి గుప్పిట్లో నుంచి బయటపడేందుకు దేశాలన్నీ పూర్తిగా లాక్ డౌన్ లో ఉన్నాయి. అయితే ఈ నిర్బంధం ప్రజలను ఇబ్బంది పెడుతున్నా.. భూకంప శాస్త్రవేత్తలకు ఓ ప్రత్యేక అవకాశాన్ని తెచ్చిపెట్టింది.

సీస్మాలజీ.. భూకంపాలకు సంబంధించి శాస్త్రం. భూమిలో ప్రకంపనలపై ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తుంటారు శాస్త్రవేత్తలు. భూప్రకంపనల శబ్దం (సీస్మిక్ నాయిస్)ను గుర్తించి భూకంపాలు, అగ్ని పర్వత విస్ఫోటాలను గుర్తిస్తారు.
About Writer
ఎం
తర్వాతి కథనం
వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వారి కోసం చర్యలు.. ఏపీ ప్రభుత్వం