కరోనా గిరోనా జాన్తా నై: ఉత్తర కొరియా
ఆది నుంచి అతిశయంతో వ్యవహరించే ఉత్తర కొరియా కరోనా వ్యవహారంలోనూ అదే శైలిని కొనసాగిస్తోంది. తమ దేశంలో కరోనా గిరోనా జాన్తానై అంటోంది.
తమది పూర్తిగా కరోనా రహిత దేశమని ఉత్తర కొరియా ఆరోగ్యశాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు ప్రకటించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది ప్రజలు కరోనా బారిన పడినట్టు స్పష్టమవుతున్నప్పటికీ ఆయన ఈ ప్రకటన చేయడం అనుమానాలను రేకెత్తిస్తున్నది.
పొరుగునే ఉన్న చైనాలో తొలి కరోనా పాజిటివ్ కేసు బయటపడిన వెంటనే సరిహద్దులన్నీ మూసి వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు కఠినమైన చర్యలు చేపట్టడంతో తమ దేశంలో ఒక్కరికి కూడా కరోనా వైరస్ సోకలేదని ఉత్తర కొరియా యాంటీ-ఎపిడెమిక్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ పాక్ మియాంగ్ సు తెలిపారు.