సంబంధిత వార్తలు
- తరగతి గదిలో విద్యార్థినిని తుపాకీతో కాల్చి తాను కాల్చుకున్న విద్యార్థి.. ఎక్కడ?
- శుభవార్త చెప్పిన డోనాల్డ్ ట్రంప్.. చమురు ధరలు భారీగా తగ్గుగాయ్...
- అసలు ఇరాన్ యుద్ధం మనకెందుకు? ట్రంప్ నిర్ణయంపై అమెరికన్ల తీవ్ర వ్యతిరేకత
- అమెరికా - ఇరాన్ శాంతి చర్చలకు దౌత్యం.. హోటల్ బిల్లు చెల్లించలేక చేతులెత్తేసిన పాక్
- ఇపుడే ఏం కాలేదు.. ముందుంది మొసళ్ళ పండుగ : అమెరికా మంత్రి
టర్కీ పాఠశాలలో కాల్పుల కలకలం ... 8 మంది విద్యార్థులు, ఓ టీచర్ దుర్మరణం
టర్కీలో దారుణం జరిగింది. 14 యేళ్ల విద్యార్థి ఒకరు విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ఎనిమిది మంది విద్యార్థులతో పాటు ఓ టీచర్ ప్రాణాలు కోల్పోయారు. అనంతరం కాల్పులు జరిపిన విద్యార్థి కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన బుధవారం కహ్రామన్‌మరాస్ ప్రావిన్స్‌లోని అయ్సెర్ కాలిక్ మిడిల్ స్కూల్‌లో ఈ విషాదం జరిగింది.
8వ తరగతి చదువుతున్న ఇసా అరాస్ మెర్సిల్లీ అనే విద్యార్థి తన తండ్రికి చెందిన ఐదు తుపాకులతో పాఠశాలకు వచ్చాడు. రెండు తరగతి గదుల్లో వెళ్లి కాల్పులు జరిపినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 13మంది విద్యార్థులు గాయపడగా, వారిలో ఆరుగురు పరిస్థితి విషమంగా ఉందని టర్కీ అంతర్గత వ్యవహారాల శాఖా మంత్రి ముస్తఫా సిఫ్త్సీ వెల్లడించారు.
నిందితుడి తండ్రి ఉగుర్ మెర్సిన్లీ ఓ మాజీ పోలీస్ అధికారి అని, ఆయనను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిపారు. అయితే, నిందితుడి మృతిపై అధికారులు అనుమాన వ్యక్తం చేస్తున్నారు. నిందితుడు తననుతాను కాల్చుని చనిపోయాడా లేక పోలీసులు జరిపిన కాల్పుల్లో హతమయ్యాడా అనే విషయంపై స్పష్టత రాలేదు. అలాగే, దాడికి గల కారణాలు తెయరాలేదు. కాగా, టర్కీలో రెండు రోజుల వ్యవధిలో స్కూలులో కాల్పుల ఘటన జరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం.
