సంబంధిత వార్తలు
- జూన్ 26 నుంచి Nova 2 Pro, Nova 2 Neo స్మార్ట్ఫోన్ల విక్రయాలు, ధర ఎంతో తెలుసా?
- ఇండియాకు నోవా వచ్చింది: NOVA2 NEO 5G, NOVA2 PRO 5G సిరీస్
- యాపిల్ స్మార్ట్ ఫోన్ కొనుగోలుదార్లకు శుభవార్త
- Ai+ Smartphone లాంచ్‌ను ఓపెన్ ట్రయల్‌గా మార్చింది
- Ai+ Smartphone మే 2026లో 3 లక్షల యూనిట్లు, ₹350 కోట్లకు పైగా రాబడి
బడ్జెట్ ధరకు వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ - ధర ఎంతంటే?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీల్లో ఒకటైన వన్ ప్లస్ కంపెనీ తాజాగా ఎన్ సిరీస్ పేరుతో మరో కొత్త స్మార్ట్ ఫోన్‌ను తీసుకురానుంది. వన్ ప్లస్ ఎన్6 పేరుతో మార్కెట్‌లోకి జూన్ 4వ తేదీ నుంచి అందుబాటులోకి తేనుంది. ఈ ఫోన్‌లో మీడియా టెక్ డైమెన్‌సిటీ 6360 చిప్‌సెట్‌తో తయారుచేశారు. అలాగే, 8000 ఎంఏహెచ్ బిగ్ బ్యాటరీ ఈ ఫోనుకు ప్రధాన ఆకర్షణ కావడం గమనార్హం. అయితే, ఈ ఫోన్‌ను ఎల్.సి.డి డిస్‌ప్లేతో తీసుకుని రావడం గమనార్హ.
వన్ ప్లస్ ఎన్6లో 6.75 అంగుళాల హెచ్‌డీ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఇచ్చారు. 120హెచ్.జడ్ రిఫ్రెష్ రేట్, 1,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉంది. ఐపీ65 రేటింగ్ సదుపాయం ఉంది. ఆండ్రాయిడ్ 16తో కూడిన ఆక్సిజన్‌ఓఎస్ 16 మీద పనిచేస్తుంది. మిలిటరీ గ్రేడ్(ఎస్‌టీడీ 810హెచ్ డ్యూరబిలిటీ) సర్టిఫికేషన్‌తో వస్తోంది. 2 ఏళ్ల ఓఎస్+ 3 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తామని కంపెనీ చెబుతోంది.
కెమెరా విషయానికొస్తే.. 50 ఎంపీ ప్రధాన కెమెరా, ముందు వైపు 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. 45డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం, 6.5డబ్ల్యూ రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్టు చేస్తుంది. ఫ్రెష్ మింట్, మిడ్‌నైట్ గ్రీన్ రంగుల్లో లభిస్తుంది.
ధర.. వన్‌ప్లస్ ఎన్6 4జీబీ+128 జీబీ వేరియంట్ ధర రూ.22,999గా కంపెనీ నిర్ణయించింది. 6GB + 128GB వేరియంట్ ధర రూ.24,999గా ఉంది. ప్రైమ్ డే సేల్‌లో భాగంగా వెయ్యి రూపాయల డిస్కౌంట్‌తో లభిస్తోంది. ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు హోల్డర్స్‌కు రూ.2 వేల డిస్కౌంట్‌ను అందిస్తోంది. అంటే రూ.19,999 ప్రారంభ ధరకు కొనుగోలు చేయొచ్చు. జులై 4 నుంచి అమెజాన్‌లో విక్రయాలకు రానుంది. నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం ఉంది.
