1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
  4. WhatsApp rolls out in-app prepaid recharge feature in India

WhatsApp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇక మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు..

Whatsapp
సోషల్ మీడియా అగ్రగామి వాట్సాప్ ద్వారా మనీ ట్రాన్సాక్షన్స్ మాత్రమే కాకుండా విద్యుత్ బిల్లులు చెల్లించడం, మెట్రో టికెట్ బుకింగ్ వంటి సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం గూగుల్ పే, ఫోన్ పేలకు పోటీగా వాట్సాప్ కొత్త సేవలు ప్రారంభించింది. 
 
ఇకపై చాటింగ్ చేస్తూనే నేరుగా మొబైల్ రీఛార్జ్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించింది. ప్రస్తుతం కొంతమంది వినియోగదారులకు అందుబాటులోకి వచ్చిన ఈ ఫీచర్, రాబోయే కొన్ని వారాల్లో దేశవ్యాప్తంగా ఉన్న ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లందరికీ లభించనుంది. 
 
దీనివల్ల వినియోగదారులు ఇతర యూపీఐ యాప్‌లకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే వాట్సాప్ ప్లాట్‌ఫామ్‌పైనే తమ సొంత నంబర్‌ను లేదా ఇతరుల నంబర్లను రీఛార్జ్ చేసుకోవచ్చు. గూగుల్ పే, ఫోన్ పే తరహాలోనే మీ బ్యాంక్ ఖాతాను లింక్ చేసుకుని ఈ సేవలు పొందవచ్చు. వాట్సాప్ హోమ్ స్క్రీన్ పైభాగంలో ఉన్న రూపాయి గుర్తుపై క్లిక్ చేసి ఈ సేవలను పొందవచ్చు. 
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
అక్కను వేధించిన వ్యక్తిని కత్తితో పొడిచి చంపేసిన తమ్ముడు