వైఎస్ వివేకా హత్య కేసు : రూ.40 కోట్లకు డీల్ - ఈడీ దర్యాప్తు
వైకాపా నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎర్ర గంగిరెడ్డి, శివశంకర్ రెడ్డి, దస్తగిరి మధ్య జరిగిన రూ.40 కోట్ల డీల్‌పై అధికారులు ప్రశ్నిస్తున్నారు.
వివేకా హత్యకు ముందు, తర్వాత బ్యాంక్ లావాదేవీలపై ఈడీ ప్రత్యేక దృష్టిసారించింది. ఈ నేపథ్యంలో బ్యాంకు స్టేట్‌మెంట్లతో దస్తగిరి విచారణకు హాజరయ్యారు. తనకు రూ.5 కోట్లు ఇస్తామని చెప్పినట్టు గతంలో దస్తగిరి సీబీఐకి తెలిపారు. నాడు ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, ఈ హత్య కేసులో పలువురు వైకాపా నేతలు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా, వీరిలో కడప వైకాపా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రితో పాటు మరికొందరు నేతలు ఉన్నారు. కాగా, ఈ కేసు విచారణను త్వరగా ముగించాలని సుధీర్ఘ కాలంగా న్యాయపోరాటం చేస్తున్న విషయం తెల్సిందే.
