1. ఇతరాలు
  2. »
  3. బాలప్రపంచం
  4. »
  5. కథనాలు
  6. Future

Child Safety | Future | Society of Children Fund | America | Extra Care | ''అతి'' ఎంతవరకు అవసరం ?

పిల్లల భద్రత
భద్రత విషయంలో అమితంగా భయపడిన పక్షి తన పిల్లలను గూడు వదలకుండా అతి జాగ్రత్తగా చూసుకుంటే అది వాటి భవిష్యతుకే ప్రమాదం తెచ్చిపెడుతుంది. రెక్కలున్నా ఎగరని తత్వమే అలవడుతుంది. మన పిల్లల విషయమూ అంతే అంటోంది అమెరికాలోని చిల్డ్రన్ సొసైటి ఫండ్.
తల్లిదండ్రులు అతి జాగ్రత్తగా... పిల్లలలో భవిష్యత్తు పట్ల అనాసక్తిని పెంచుతుంది. దీని వల్ల వారి తమకేమి పట్టనట్టు మారుతున్నారని భవిష్యత్తు పట్ల నిర్లిప్తంగా ఉంటున్నారని ఈ ఫండ్ చేపట్టిన సర్వే నిరూపిస్తుంది. ఇటీవల చిల్డ్రన్ సొసైటి ఫండ్ రెండు వేలమంది (ఎనిమిది నుంచి పదిహేను ఏళ్ల లోపు) పిల్లలను ఈ సర్వేకు ఎంచుకుంది.

పిల్లలు తమ భవిష్యత్తు పట్ల ఏ మేరకు కలలు కంటున్నారు ? ఎంత ఆనందంగా ఉంటున్నారు ?
అనే విషయంపై జరిపిన ఈ సర్వేలో ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగుచూశాయి.
పిల్లలను రక్షించాలనే తపనతో తల్లిదండ్రులు 'అతి' ని ప్రదర్శిస్తున్నారని, దీని వల్లే వారిలో భయం
సవాళ్లను ఎదుర్కొనే శక్తి లేకపోవడం, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవలేకపోవడం....
వంటి లోపాలెన్నో సర్వే గమనించింది. ఇదే వారి భవిష్యత్తు పట్ల అనాశక్తిని ప్రదర్శించేలా చేస్తుందని తేల్చింది. ప్రతి ఎనిమిదిలో ఒకరు తల్లిదండ్రుల 'అతి' జాగ్రత్త వల్ల స్వతంత్రప్రతిపత్తి కోల్పోయి ఆనందంగా లేమని చెప్పగా, తొమ్మిది శాతం మంది టీనేజర్లు తమకు జీవితంలో ఏదీ ఎంచుకునే హక్కే లేదని బాధను వెలిబుచ్చారు.

ఈ విషయమై పిల్లల మనస్తత్వ నిపుణులు డా.కైరేన్ మాట్లాడుతూ 'కొంత మంది తల్లిదండ్రులు అనవసరంగా పిల్లల విషయంలో అమిత ఆందోళనకు లోనవుతుంటారు. పిల్లలను రక్షించాలనే తప్పనలో 'ఏది తప్పో, ఏది ఒప్పో' తల్లిదండ్రలు తెలుసుకోలేకపోతుంటే, తమకు తల్లిదండ్రుల నుంచి రక్షణ ఏయే సమయంలో అవసరమో పిల్లలు గుర్తించలేకపోతున్నారు. పిల్లలు - తల్లిదండ్రులు ఈ విషయంలో సరైన అవగాహనకు వస్తేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది'. అని సూచించారు.
About Writer
KISHORE