1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. చిట్కాలు
  4. Under pressure: Are teen girls facing too much

లవ్ ఫెయిల్ అయితే ఎక్కువ బాధపడేది అమ్మాయిలే!!

Under pressure
ప్రేమ విఫలమైతే అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ బాధపడతారని భారత్ సహా 96 దేశాల్లో బింగ్‌హాంటన్ వర్శిటీ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. లవ్ ఫెయిల్ అయితే అమ్మాయిలే ఎక్కువ మానసికంగా, శారీరకంగా బాధలు అనుభవిస్తారని పరిశోధకులు తెలిపారు. భారత్‌తో సహా 96 దేశాల్లో బింగ్‌హాంటన్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. బ్రిటన్‌, అమెరికా, భారత్‌ కెనడా, బ్రిటన్‌, జర్మనీ దేశాల్లో అధ్యయనం చేశారు. 
 
లవ్‌లో నిమగ్నమై అమ్మాయిలు ఒక్కడుగు ముందుకేసినా గర్భం.. శారీరక బాధను అనుభవించాల్సిందేనని.. దీనినే జీవ సంబంధమైన అంశంగా పరిశోధకులు తెలిపారు. ప్రేమ విషయంలో సున్నితంగా ఉండే అమ్మాయిలు విఫలమైతే మాత్రం చాలా ఎక్కువగా బాధపడుతారని పరిశోధకులు అన్నారు. ఇంకా ప్రేమ విఫలమైతే ఆ ప్రేమను జీవితంలో ఏ స్థాయికి ఎదిగినా అంత సులభంగా మరిచిపోరని పరిశోధకులు చెప్పారు. 
About Writer
Selvi