ప్రేమతో ప్రేమను గెలవండి
ప్రేమ అదో రెండక్షరాల తియ్యని మైకం. ఆ భావం ఓసారి హృదయాన్ని తాకిందంటే చాలు మనిషికి ఆనంద సాగరంలో తేలిపోతున్న భావం ఏర్పడుతుంది. ఆ క్షణంలో జగత్తులోని ప్రతి ఒక్కటీ మరింత అందంగా కనిపిస్తుంది. అందుకే ప్రేమలో పడ్డ వ్యక్తి తన ప్రేయసి లేదా ప్రియుని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే గంటలు సైతం క్షణాల్లా సాగిపోతుంటాయి.
అదేమరి ప్రేమకున్న గొప్పతనమంటే. ఓ అబ్బాయిని అమ్మాయి చూసినా, అమ్మాయిని చూసినా కలిగే ఈ ప్రేమ భావం అంతకుముందు క్షణం వరకు ఎవరిని చూసినా కలగకపోవడమే ప్రేమకున్న గొప్పతనం. తన మనసులో అలజడి రేపిన ప్రేయసి లేదా ప్రేమికుడి కోసం ఆ క్షణం నుంచి ఏం చేయడానికి వ్యక్తులు సిద్ధమైపోతారు.
అయితే ప్రేమ భావం ఒకేసారి ఆమ్మాయి, అబ్బాయి మధ్య పుట్టాలన్న రూలేం లేదు. అమ్మాయిని అబ్బాయి చూచిన క్షణంలో ఆ అమ్మాయి ఆ అబ్బాయిని అస్సలు చూసుండక పోవచ్చు. అలాగే మరో సందర్భంలో ఆ అమ్మాయిని చూచినా ఆ అబ్బాయికి ఆమెపై ప్రేమభావం కలగకపోవచ్చు.
ఎందుకంటే ప్రారంభంలో చెప్పుకున్నట్టు ప్రేమభావం ఇద్దరు వ్యక్తుల్లో ఒకేసారి పుట్టకపోవచ్చు. మరి ఒకరిలో పుట్టిన ఈ ప్రేమను రెండోవారికి తెలియజెప్పి వారిని సైతం ప్రేమ సాగరంలో ముంచేది ఎలా. ఒకవైపు నుంచి ప్రేమించే ఆడ, మగ ఇద్దరిలోనూ ఉదయించే ప్రశ్న ఇదే.
అయితే మనలో పుట్టిన ప్రేమను ఎదుటివారికి తెలియజెప్పి వారిని కూడా ప్రేమలో పడేయాలంటే అంతకష్టమేమీ కాదు. అలాగే అంత సులభం కూడా కాదు. కానీ ప్రేమను గెల్చుకోవాలంటే మనం ఏం చేయాలి. ప్రేమను గెలవాలంటే ఒకటే మార్గం ప్రేమను ప్రేమతోనే జయించాలి.
మీ ప్రేయసి లేదా ప్రేమికుడి వద్ద మీకు నచ్చిన లక్షణాలను వెతకడంతో పాటు వారికి నచ్చే అంశాలేమిటో ఆరా తీయండి. ఆ రకమైన లక్షణాలు మీలో లేకుంటే వాటిని అలవాటు చేసుకోండి. ఆ లక్షణాలను ప్రదర్శించే సమయం వచ్చినప్పుడు మీ ప్రేయసి లేదా ప్రేమికుడికి తెలిసేలా జాగ్రత్త తీసుకోండి.
అయితే వారి మెప్పు పొందడం కోసం అలా చేస్తున్నట్టుగా వారికి తెలియకుండా జాగ్రత్త తీసుకోండి. సమయం దొరికినప్పుడు మీ ప్రేయసి లేదా ప్రేమికునితో మాటలు కలపండి. మాటల సందర్భంలో మీ గురించి ఎదుటివారికి చెప్పండి. అలాగే వారి గురించి మీరూ తెల్సుకోండి. అలా వీలున్నప్పుడు అభిప్రాయాలు పంచుకోండి.
అలా కొంతకాలం గడిచేసరికి మీ ప్రేయసి లేదా మీ ప్రేమికుని ఆలోచనల్లోనూ, మనసులోనూ వారికే తెలియకుండా స్థానం సంపాదించండి. ఇంతవరకు మీరు చేయగల్గితే చాలు. మీ ప్రేమకోసం ఎదుటివారే వెతుక్కుంటూ వస్తారు. ఒకవేళ మీ ప్రేమ కావాలని వారు అడగడానికి సంశయిస్తుంటే ఆ విషయం మీకు స్పష్టంగా తెలిస్తే మీరే చొరవతీసుకుని మీ ప్రేమను వ్యక్తం చేయవచ్చు.
ఈ విధంగా ఒకరిపై ఒకరికి కలిగిన ప్రేమ నుంచి పుట్టిన ప్రేమ ఒక్కసారి మీ మధ్య ప్రవేశిస్తే మిమ్మల్ని వేరు చేయడం ఇక ఎవరి తరం కాదు.