Mandadi teaser: విజువల్స్, బోట్ సీక్వెన్స్ తో సుహాస్, సూరి ల మండాడి టీజర్
Mandadi teser poster
ఈ క్రమంలో తాజాగా టీజర్‌ను విడుదల చేశారు. పందెమే మనల్ని కాపాడుతుంది.. పందెన్నీ మనం కాపాడటం లేదు, బరిలోకి దిగే ప్లేయర్స్‌లో నిజాయితీ ఉంటే.. ఈ గాలి, సముద్రం మిమ్మల్ని ఎప్పటికీ ఒగ్గేయదు అనే డైలాగ్స్, టీజర్‌లో చూపించిన విజువల్స్, బోట్ సీక్వెన్స్, పడవ పందెంలకు సంబంధించిన సీన్లు హైలెట్‌గా నిలుస్తున్నాయి. ఇక సుహాస్, సూరి పవర్ ఫుల్ ఎంట్రీలు, జీవీ ప్రకాష్ ఇచ్చిన బీజీఎం నెక్ట్స్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎస్.ఆర్. కథిర్ సినిమాటోగ్రఫీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.
టీజర్‌తో ఒక్కసారిగా అంచనాలు రెట్టింపు అయ్యాయి. డైలాగ్స్, ఎమోషన్స్, యాక్షన్స్ ఇలా అన్ని రకాలుగా మండాడి ఇంటెన్స్‌గా ఉండబోతోందని అర్థం అవుతోంది. ఈ సినిమాకి సంగీతాన్ని జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా, ఎస్.ఆర్. కథిర్ సినిమాటోగ్రఫర్‌గా పని చేశారు. ప్రొడక్షన్ డిజైన్‌ను డి.ఆర్.కె. కిరణ్, ఎడిటింగ్‌ను ప్రదీప్ ఇ. రాఘవ్, యాక్షన్ సన్నివేశాలకు పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బురాయన్, మహేష్ మాథ్యూ కంపోజ్ చేశారు. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీలో ఈ సినిమాని సెప్టెంబర్ 10న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.
నటీనటులు* : సూరి, సుహాస్, మహిమా నంబియార్, సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు
