కిలో రేషన్, వితంతు పింఛన్ కోసం వెళ్లిన మహిళ, 13 మందికి ఎయిడ్స్ వచ్చింది
కొంతమంది మహిళల పేదరికాన్ని ఆసరా చేసుకుని కొందరు కామాంధులు వారి జీవితాలను నాశనం చేస్తున్నారు. ఐతే ముంబైలో జరిగిన ఈ ఘటన మహిళ జీవితంతో పాటు ఆమెతో సంబంధం పెట్టుకున్న 13 మందికి ఎయిడ్స్ సోకి ఆస్పత్రుల్లో లబోదిబోమంటున్నారు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి.
ముంబైలోని ఓ పారిశ్రామిక వాడలో నివాసం వుంటున్న 24 ఏళ్ల యువతికి 3 ఏళ్ల క్రితం వివాహమైంది. భర్త ఇటీవలే మరణించాడు. దాంతో కుటుంబాన్ని పోషించడం భారంగా మారింది. ఈ క్రమంలో ఆమె తన భర్త డెత్ సర్టిఫికెట్ తీసుకుని రేషన్, వితంతు పింఛన్ కోసమని విలేజ్ ఎంప్లాయ్మెంట్ అసిస్టెంట్ వద్దకు వెళ్లింది. ఈ అసిస్టెంట్ ఆమెను తీసుకెళ్లి విలేజ్ ఎంప్లాయ్ మెంట్ అధికారికి పరిచయం చేసి పనిచేసి పెట్టాలని అభ్యర్థించాడు. అతడు కాస్తా ఆమెను సెక్రటరీకి పరిచయం చేసాడు.
ఐతే నీకు పనిచేసి పెడతాం సరే... మాకేంటి అని ప్రశ్నించడం మొదలుపెట్టారు వారు. దీనితో ఆమె తన నుంచి వారు ఏమి ఆశిస్తున్నారో తెలుసుకున్నది ఆ మహిళ. మరో దారి లేక తనకు రేషన్, వితంతు పింఛన్ ఇప్పిస్తారన్న నమ్మకంతో వారి కోర్కె తీర్చింది. ఈ క్రమంలో ఆమెతో 13 మంది సన్నిహిత సంబంధం సాగించారు. ఇలా మూడేళ్లపాటు సాగింది. ఐతే వున్నట్లుండి సదరు మహిళ ఇకపై ఎవరూ తన వద్దకు రావద్దని హెచ్చరించింది. కారణం ఏంటని అడిగినవారితో తనకు ఆరోగ్యం బాగా లేదని తెలిపింది.
ఆమె ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి పరీక్షలు చేయించుకోగా ఎయిడ్స్ వ్యాధి వచ్చినట్లు నిర్థారణైంది. ఈ విషయం కాస్తా విలేజ్ ఎంప్లాయ్ మెంట్ అధికారికి తెలియడంతో వెంటనే అతడు కూడా పరీక్ష చేయించుకున్నాడు. అతడికి కూడా హెచ్ఐవీ పాజిటివ్ వచ్చింది. దీనితో బెంబేలెత్తిపోయిన అతడు మిగిలినవారికి సమాచారం అందించాడు. ఆమెతో సంబంధం పెట్టుకున్నవారంతా వైద్య పరీక్షలు చేయించుకోగా, వారికి కూడా ఎయిడ్స్ వ్యాధి నిర్థారణ అయ్యింది. ఇపుడు వారంతా లబోదిబోమంటూ గగ్గోలు పెడుతున్నారు. ఒక్క కిలో రేషన్, వితంతు పింఛన్ కోసం మహిళ వెళితే ఆమె జీవితాన్ని నాశనం చేయడమే కాకుండా మరో 13 మంది పురుషులు ఎయిడ్స్ బారిన పడ్డారు. ఈ కామాంధుల కారణంగా వారి భాగస్వాములు కూడా బలయ్యే పరిస్థితి వచ్చింది.

