మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 1 జులై 2021 (20:46 IST)

వరుడు నచ్చలేదు.. పెళ్లి మండపం నుంచి వెళ్లిపోయిన వధువు

పెళ్లి మండపం నుంచి వరుడు నచ్చలేదంటూ హోమం చుట్టూ ఏడు అడుగులు నడిచిన తర్వాత వరుడు నచ్చలేదంటూ వధువు పెండ్లి మండపం నుంచి వెళ్లిపోయింది. జార్ఖండ్‌ రాజధాని రాంచీలో ఈ ఘటన జరిగింది. వరుడు వినోద్‌కు, వధువు చందాకు వివాహం నిశ్చయమైంది. మంగళవారం వీరి పెండ్లి జరుగుతుండగా వధువరులు అగ్ని చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేశారు. 
 
అనంతరం సింధూర దాన్‌ కార్యక్రమానికి ముందు వరుడు వినోద్‌ తనకు నచ్చలేదంటూ వధువు చందా పెండ్లి పీటల మీద నుంచి లేచి పెండ్లి మండపం దిగి వెళ్లిపోయింది. వధువు తల్లిదండ్రులు ఆమెకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. 
 
దీంతో వరుడి తరుఫు బంధువులు వధువు ఇంటి ముందు నిరసన తెలిపారు. తమకు అయిన పెండ్లి ఖర్చులను చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కాగా, తన కుమార్తె పెండ్లికి సిద్ధంగా లేదని, తన వద్ద డబ్బులు లేవని వధువు తండ్రి వరుడి బంధువులకు నచ్చజెప్పారు.