1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. I know who is behind sting operation, says D.K. Shivakumar

స్టింగ్ ఆపరేషన్ వెనుక ఉన్న పితామహుడు ఎవరో తెలుసు : సీఎం డీకే శివకుమార్

DK Shivakumar
కర్నాటక రాష్ట్ర మంత్రులను లక్ష్యంగా చేసుకుని జరిగిన స్టింగ్ ఆపరేషన్‌పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రులపై రహస్య కుట్ర సాగుతోందని, ఈ కుట్ర ఎవరున్నారో  కూడా తనకు బాగా తెలుసంటూ ఆయన బాంబు పేల్చారు. పనిలో పనిగా తనను కూడా ట్రాప్ చేసేందుకు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన స్టింగ్ ఆపరేషన్‌పై సీఎం డీకే శివకుమార్ మాట్లాడుతూ, 'నేను ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాక.. రహస్య కార్యాచరణ ద్వారా ఇరికించేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఆ అంశాన్ని దృష్టిలో ఉంచుకునే మంత్రులు, తమ పార్టీ నేతలను అప్రమత్తం చేశా'నని వివరించారు. 
 
ఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశానికి హాజరయ్యేందుకు ముందుగా తనను కలుసుకున్న విలేకరులతో గురువారం ఆయన మాట్లాడారు. మంత్రులపై రహస్య కార్యాచరణ నిర్వహించి, ఇరికించేందుకు ప్రయత్నించిన 'పితామహుడు' ఎవరో తనకు తెలుసని చెప్పారు. దాని కోసం ఏజెంట్లను నియమించుకోవడం, ఆర్థిక సహకారాన్ని అందించడం తదితర అంశాలు గుర్తించానని వివరించారు. 
 
నేను చేస్తున్న అన్ని ఆరోపణలకూ ఆధారాలు ఉన్నాయని తెలిపారు. బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా ఏది మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలో తెలుసని వ్యాఖ్యానించారు. స్టింగ్‌ ఆపరేషన్‌ వెనుక కన్నడిగులు ఉన్నారా? బయటి వ్యక్తులు ఉన్నారా? అనే అంశాన్ని తాను చెప్పవలసిన అవసరం లేదన్నారు. తన వద్దకు వచ్చిన వారికి సంబంధించిన వివరాలు, ఫొటోలు, తమ కార్యాలయంలో అధికారికంగా రికార్డయి ఉంటాయని చెప్పారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
అక్టోబర్ 09, 2026: శుక్రవారం నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?