1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. JEE-Advanced data breach claims misleading, factually incorrect: IIT-Roorkee

జేఈఈ అడ్వాన్స్ 2026 విద్యార్థుల వ్యక్తిగత డేటా లీక్

JEE Advanced 2026
దేశంలో అత్యంత ప్రతిష్టాత్మక పరీక్షల్లో జేఈఈ అడ్వాన్స్ ఒకటి. అయితే, ఈ యేడాది జరిగిన జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 పరీక్షకు హాజరైన విద్యార్థుల వ్యక్తిగత డేటా మొత్తం లీకైనట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను ఐఐటీ రూర్కెలా ఖండించింది. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు హాజరైన విద్యార్థుల వ్యక్తిగత డేటా లీకైనట్టు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. 
 
జేఈఈ (అడ్వాన్స్‌డ్‌)-2026 ఫలితాలకు సంబంధించిన క్లౌడ్‌ స్టోరేజ్‌ కాన్ఫిగరేషన్‌లో లోపం ఉన్న విషయం వాస్తవమేనని పేర్కొంది. అయితే, క్లౌడ్‌ స్టోరేజ్‌లో ఉన్న విద్యార్థుల డేటా కేవలం చదవడానికి మాత్రమే వీలుందని, మార్పు చేర్పులు చేసేందుకు అవకాశం లేదని స్పష్టం చేసింది.
 
విద్యార్థులను తప్పుదోవ పట్టించేందుకు కొందరు ఉద్దేశపూర్వకంగానే ఇటువంటి తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని ఐఐటీ రూర్కీ పేర్కొంది. క్లౌడ్‌ స్టోరేజ్‌ నుంచి ఏ విద్యార్థికి సంబంధించిన సమాచారాన్ని ఎవరూ సంగ్రహించలేరని.. అభ్యర్థుల మార్కులు, ర్యాంకులు, పరీక్ష ఫలితాలపై ఎలాంటి ప్రభావం పడలేదని వెల్లడించింది. 
 
అయినప్పటికీ, సమాచార గోప్యతను పరిరక్షించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపింది. లక్షలాది విద్యార్థుల వ్యక్తిగత వివరాలతోపాటు, వారి పరీక్ష ఫలితాలకు సంబంధించిన సమాచారానికి గోప్యత, రక్షణ కరవైందంటూ ఓ యువ సైబర్‌ భద్రతా పరిశోధకుడు ఎత్తి చూపిన నేపథ్యంలో ఐఐటీ రూర్కీ ఈ మేరకు ప్రకటన వెలువరించింది. ఇదీ చదవండి: సీబీఎస్‌ఈ పోర్టల్‌పై క్లాడ్‌ టూల్స్‌ దాడి
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
పబ్లిక్ ఇన్వెస్టర్లకు ఎక్స్‌క్లూజివ్ బోనస్ జారీకి స్ట్రింగ్ మెటావర్స్ వాటాదారుల ఆమోదం; రికార్డ్ తేదీగా జూన్ 19 ఖరారు