1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Karnataka : 10th class girl plot rape drama to skip home work

హోం వర్క్ చేయాలని కిడ్నాప్.. అత్యాచారం డ్రామా... ఖంగుతిన్న పోలీసులు

Karnataka
ఇప్పటిపిల్లలకు ఎక్కడలేని ఆలోచనలు వస్తున్నాయి. హోం వర్క్ చేయడం ఇష్టంలేని ఓ బాలిక అత్యాచారం కట్టుకథ అల్లింది. తనను ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారంటూ ఆరోపించింది. దీంతో పోలీసులు ఆ బాలికను ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించగా, అసలు నిజం తేలింది. అస్సలు అత్యాచారమే జరగలేదని వైద్యులు తేల్చడంతో ఖంగుతిన్న పోలీసులు.. ఆ బాలికను నిలదీయగా అసలు విషయం వెల్లడించింది. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఉత్తర కన్నడ జిల్లాలోని యల్లాపుర తాలూకా నందొళ్లి గ్రామానికి చెందిన బాలిక పదో తరగతి చదువుతోంది. గత బుధవారం పాఠశాలకు వెళ్లిన బాలిక తిరిగి ఇంటికి రాలేదు. కంగారుపడిన బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు బాలిక కోసం గాలింపు మొదలుపెట్టారు. ఈ క్రమంలో గ్రామ సమీపంలోని అడవిలో బాలిక కనిపించింది. ఆమెను రక్షించిన పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.
 
అనంతరం బాలికను ప్రశ్నించగా తనను ముగ్గురు దుండగులు అపహరించారని, ఆపై అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పింది. అయితే, వైద్య పరీక్షల్లో మాత్రం అత్యాచారం జరగలేదని తేలింది. దీంతో బాలికను గట్టిగా ప్రశ్నించే సరికి అసలు విషయం చెప్పింది. 
 
హోం వర్క్ చేయలేదని, దాని నుంచి తప్పించుకునేందుకే ఈ నాటకం ఆడినట్టు చెప్పింది. దీంతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
ఏప్రిల్‌లో ఏపీ సహకార సంఘాల ఎన్నికలు!