శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 1 మార్చి 2021 (11:18 IST)

నేల మీద కూర్చుని చంద్రబాబు నిరసన.. రేణుగుంట ఎయిర్ పోర్టులో హైటెన్షన్

గంటసేపుగా టీడీపీ అధినేత చంద్రబాబు రేణుగుంట  ఎయిర్ పోర్టులోనే నిరీక్షిస్తున్నారు. లాంజ్ నుంచి బయటకు వెళ్లనియ్యకుండా చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు.

అనుమతి లేదంటూ నోటీసులు ఇచ్చారు. పోలీసుల తీరును నిరసిస్తూ.. చంద్రబాబు ఎయిర్ పోర్టులోనే బైఠాయించారు. రేణుగుంట ఎయిర్ పోర్టులో హైటెన్షన్ నెలకొంది. 
 
 
కలెక్టర్, ఎస్పీని కలవడానికి తాను వెళతానంటున్నా.. వెళ్లనివ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. వాళ్లను ఇక్కడికే పిలిపిస్తామని పోలీసులు చెప్పగా... తానేం అంత గొప్ప వ్యక్తిని కాదని.. తనకు తానుగా అక్కడికి వెళతానని అన్నారు.

తనదగ్గరకే పిలిపిస్తామని చెప్పడాన్ని ఆయన తోసిపుచ్చారు. ప్రపంచానికి ప్రభుత్వం చేసే అరాచకాలు తెలియాల్సిందేనన్నారు. మీడియాతో కూడా మాట్లాడించకపోవడాన్ని కూడా ప్రశ్నించారు.

‘‘నేనేమైనా హత్య చేయడానికి వెళుతున్నానా.. 14 ఏళ్లు సీఎంగా ఉన్నాను. ప్రతిపక్ష నేతను నేను. నన్నెందుకు  నిర్బంధించారో చెప్పండి’’ అన్నారు.