గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (14:40 IST)

చంద్రబాబు ఎప్పుడు పని చేశారో ఎవ్వరికీ తెలియదు: మంత్రి పెద్దిరెడ్డి

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై మంత్రి పెద్దిరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నిన్నటికి రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ఫలితాలు వచ్చాయని... నాలుగు విడతల్లో ఎన్నికలు జరుగగా...అన్నింటిలోనూ వైసీపీకి అత్యధిక మెజారిటీ వచ్చిందన్నారు. పల్లెల్లో సీఎం అభివృద్ది చూసి ఓటు వేశారని తెలిపారు. అయితే తాను యాభై శాతం గెలిచినట్లు చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు.

టీడీపీకి 15.75 శాతం మాత్రమే వచ్చిందని స్పష్టం చేశారు.  ఓటర్లను ప్రలోభాలు పెట్టేందుకు టీడీపీ చాలా ప్రయత్నాలు చేసిందని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో సీఎం ఇచ్చిన హామీలు నెరవేర్చడం వల్లనే ప్రజలు వైసీపీకి అత్యధిక మెజారిటీ ఇచ్చారని మంత్రి తెలిపారు.  సజావుగా ఎన్నికలు జరిగినా వైసీపీకి ఓట్ల శాతం పెరిగేదన్నారు.

మున్సిపాలిటీ , కార్పొరేషన్లలో కూడా వైసీపీకి అత్యధిక మెజారిటీ వస్తుందని స్పష్టం చేశారు. ఇంతకంటే కూడా ఎక్కువ మెజారిటీ రావడానికి కృషి చేస్తామని చెప్పారు. జాతీయ స్థాయిలో సీఎం జగన్‌కు మంచి గుర్తింపు ఉందన్నారు. ప్రతి రోజు కూడా సీఎం జగన్ నియమ, నిబద్ధతతో శాఖల సమీక్షలు చేశారన్నారు.

సీఎం పరిపాలన వల్లనే వైసీపీకి ఇప్పుడు ఈ గెలుపు సాధ్యం అయిందని పేర్కొన్నారు. చంద్రబాబు రోజుకి 18 గంటలు పనిచేసినట్లు చెప్పారని... ఎక్కడ ఎప్పుడు పని చేశారో కూడా తెలియదని యెద్దేవా చేశారు. కుప్పంలో దౌర్జన్యాలు చేశారని..అయినా ఓటమి పాలయ్యారని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు.