శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (16:41 IST)

భార్యాపిల్లలతో బైకుపై వెళ్తుండగా దూకిన చిరుతపులి, చిరుతతో వీరోచిత పోరాటంలో...

సాధారణంగా క్రూరమృగాలను చూస్తే ఆమడదూరం పారిపోతుంటారు. కానీ, ఆ వ్యక్తి కోసం తన కుటుంబ సభ్యులను కాపాడుకునేందుకు ఏకంగా చిరుతపులితో తలపడి విజయం సాధించారు. తన భార్య, కుమార్తెన కాపాడుకునేందుకు కుటుంబ యజమాని చిరుతపులిని చంపేశాడు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కర్ణాటకలోని హసన్ జిల్లా బెండాకెరె ప్రాంతానికి చెందిన రాజగోపాల్ నాయక్ అనే వ్యక్తి తన భార్య, కుమార్తెతో కలిసి ద్విచక్రవాహనంపై వెళుతుండగా, అటవీప్రాంతంలో ఓ చిరుతపులి దాడి చేసింది. 
 
చిరుత ధాటికి బైక్ అదుపుతప్పి కిందపడిపోయింది. ఈ క్రమంలో ఆ చిరుత తన భార్య, కుమార్తెలను గాయపర్చడం చూసిన రాజగోపాల్ నాయక్ ప్రాణాలకు తెగించి ఆ చిరుతతో పోరాడాడు. 
 
తనకు గాయాలు అయినప్పటికీ భయపడకుండా ఆ చిరుతపులిని చంపేశాడు. చిరుత దాడిలో గాయపడిన రాజగోపాల్‌తో పాటు అతడి భార్య, కుమార్తెలను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఎవరికీ ప్రాణాపాయం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.