మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Updated : శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (16:34 IST)

కాఫీ ఎస్టేట్ మహిళా యజమాని, రేప్ చేసి హత్య చేసి ఆ తర్వాత...

ఒంటరి మహిళ. కావాల్సినంత ఆస్తి ఉంది. అయినా వ్యాపారం చేస్తూ నాలుగు రూపాయలు వెనకేసుకోవడం అలవాటు చేసుకుంది. ఒంటరిగా ఉండటం అలవాటుగా మారినా తన వ్యాపారాన్ని మాత్రం అందరితో కలిసి చేసేది. ఇద్దరు కూతుళ్ళకు బాగా ఆర్థికంగా స్థిరపడిన వారికే ఇచ్చి పెళ్ళి చేసింది. అయితే ఈమె అందంగా ఉండటంతో పాటు ఆస్తిపరురాలు కావడంతో అతి దారుణంగా గుర్తుతెలియని వ్యక్తులు చంపేశారు.
 
కర్ణాటక రాష్ట్రం కొడగు జిల్లా కేంద్రం మడికెరె సమీపంలోని నిడుగనే గ్రామంలో నివసిస్తోందీమె. ఈమెకు ఇద్దరు కుమార్తెలు. చంద్రావతి, మీనాక్షి. ఇద్దరికీ వివాహం చేసింది. 12 ఎకరాల కాఫీ ఎస్టేట్ ఉంది. కావాల్సినంత డబ్బు. భర్త అనారోగ్యంతో చనిపోయాడు. అప్పటి నుంచి ఆమె ఒంటరిగానే ఉంటోంది.
 
అది కూడా కాఫీ తోటలోనే ఉంటోంది. కాఫీ తోటలో పనులు చేయించడం.. వచ్చిన డబ్బులను బ్యాంకులో వేయడం.. ఇది ఆమె దినచర్య. డబ్బు ఉంది కదా అని ఖర్చు ఏమాత్రం పెట్టేది కాదట. అలా పొదుపుగా వాడుకుంటూ వచ్చేది. అయితే ఇదంతా చూసిన గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను అతి దారుణంగా చంపేశారు.
 
ఆమె నోటిలో గుడ్డలు కుక్కి అత్యాచారం చేసిన తరువాత హత్య చేశారట. ఎప్పుడూ ఫోన్ తీసే తల్లి ఎంతకూ ఫోన్ తీయకపోవడంతో అనుమానం వచ్చిన కుమార్తెలు ఇంటికి వచ్చేసరికి రక్తపుమడుగులో తల్లి ఉండడంతో పాటు బీరువాలో ఉన్న డబ్బులు, నగలు కనిపించలేదట. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.