1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Karnataka man commits suicide on first night

భార్యను తమ్ముడికిచ్చి పెళ్లి చేయండి.. తొలిరాత్రి రోజున ఉరేసుకుని?

పెళ్లి చేసుకుని 24గంటలు కూడా కాలేదు. ఇంతలో పెళ్లి కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతేగాకుండా సూసైడ్ నోట్‌లో తన భార్యను తన తమ్ముడికి ఇచ్చి వివాహం చేయాల్సిందిగా ఆ కొత్త పెళ్లికొడుకు కోరాడు. ఈ ఘటన కర్ణాట

Karnataka
పెళ్లి చేసుకుని 24గంటలు కూడా కాలేదు. ఇంతలో పెళ్లి కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతేగాకుండా సూసైడ్ నోట్‌లో తన భార్యను తన తమ్ముడికి ఇచ్చి వివాహం చేయాల్సిందిగా ఆ కొత్త పెళ్లికొడుకు కోరాడు. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చిక్కబళ్లాపుర సమీపంలోని సూలికుంటె గ్రామంలో మునిరాజు (30) అనే యువకుడికి.. ఆయన సోదరి కుమార్తెతో వివాహం అట్టహాసంగా జరిగింది. 
 
అయితే వివాహం తర్వాత తొలిరాత్రి కోసం దంపతులను గదిలోకి పంపారు. ఆ సమయంలో భార్యతో అంటీముట్టగానే వున్నాడు మునిరాజు. తెల్లవారుజామున ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 
 
అతడు రాసిన లేఖలో అక్క కుమార్తెతో వివాహం తనకు ఇష్టం లేదని స్పష్టం చేశాడు. పెద్దలు బలవంతం చేయడంతోనే ఆమెను వివాహం చేసుకున్నానని.. తన తమ్ముడికి ఆమెనిచ్చి వివాహం చేయాలని కోరాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 
About Writer
selvi
తర్వాతి కథనం
ఆంధ్రా ఎంపీని అవమానించిన కాంగ్రెస్.. సభలో దొరకని మద్దతు