మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 7 ఫిబ్రవరి 2018 (09:56 IST)

బీజేపీ హయాంలో పెరిగిన మతకలహాలు... యూపీలోనే అధికం

కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో బీజేపీ సర్కారు కొలువుదీరిన తర్వాత దేశ వ్యాప్తంగా మతకలహాలు పెరిగాయి. ముఖ్యంగా, బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరీ ఎక్కువగా చోటుచేసుకుంటున్

కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో బీజేపీ సర్కారు కొలువుదీరిన తర్వాత దేశ వ్యాప్తంగా మతకలహాలు పెరిగాయి. ముఖ్యంగా, బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరీ ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నివేదిక బట్టబయలు చేసింది. దీంతో కేంద్రంలోని బీజేపీ పాలకులు విస్తుపోయారు. ఈ నివేదిక వివరాలను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్సరాజ్ ఆహిర్ పార్లమెంటులో వెల్లడించారు. 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మతకలహాలు ఎక్కువగా జరిగాయనే వాస్తవాన్ని గత యేడాది దేశంలో 822 మతకలహాల ఘటనలు జరగ్గా వాటిలో 111 మంది మరణించగా, మరో 2,384 మంది గాయపడ్డారని కేంద్ర మంత్రి పార్లమెంటులో ఓ సభ్యుడి ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో చెప్పారు. 2015వ సంవత్సరంలో 751 మతకలహాలు, 2016లో 703 ఘటనలు జరగ్గా వాటిలో 183 మంది మరణించారనే వాస్తవాన్ని కేంద్ర మంత్రి చెప్పారు. 
 
దేశంలోనే మతకలహాలు అత్యధికంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 195 ఘటనలు చోటుచేసుకున్నాయి. కర్ణాటక రాష్ట్రంలో 100, రాజస్థాన్‌లో 91, బీహార్‌లో 85, మధ్యప్రదేశ్‌లో 60, పశ్చిమబెంగాల్‌లో 58, గుజరాత్‌లో 50 మతకల్లోల ఘటనలు జరిగాయి. ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రంతో పాటు యూపీలోనూ మతకలహాల ఘటనలు జరగడం విశేషం.