శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 6 ఫిబ్రవరి 2018 (15:31 IST)

తాళికట్టే సమయానికి ఆ నిజం తెలిసింది.. వరుడు ఏం చేశాడంటే?

డబ్బు సంపాదించడమే లక్ష్యంగా ఓ మహిళ ఎనిమిది మందిని వివాహం చేసుకున్న ఘటన సంచలనం సృష్టించింది. టెక్నాలజీ పెరిగినా అక్కడక్కడా కొత్త విధానంలో మోసాలు పెరిగిపోతున్నాయి. తాజాగా కేరళకు చెందిన మహిళ ఎనిమిది యువక

డబ్బు సంపాదించడమే లక్ష్యంగా ఓ మహిళ ఎనిమిది మందిని వివాహం చేసుకున్న ఘటన సంచలనం సృష్టించింది. టెక్నాలజీ పెరిగినా అక్కడక్కడా కొత్త విధానంలో మోసాలు పెరిగిపోతున్నాయి.

తాజాగా కేరళకు చెందిన మహిళ ఎనిమిది యువకులను ప్రేమ పేరిట మోసం చేసి డబ్బులు గుంజేసింది. వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన షాలిని అనే మహిళ పత్రికలో తానొక వితంతువు అని ప్రకటన ఇచ్చింది. ఆ ప్రకటనలో తాను రెండో వివాహం చేసుకునేందుకు సుముఖంగా వున్నట్లు ప్రకటించింది.
 
ఈ ప్రకటన చూసిన యువకుడు షాలినితో మాట్లాడాడు. పెద్దల సమక్షంలో వివాహం కూడా నిశ్చయించుకున్నాడు. ఆమె మాటలను నమ్మిన యువకుడికి తాళికట్టే సమయానికి అసలు నిజం తెలిసింది. షాలిని వివాహం చేసుకునేందుకు సిద్ధమైన యువకుడి స్నేహితుడు కూడా ఆమె చేతిలో మోసపోయాడు. ఈ విషయం తెలుసుకున్న వరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణలో షాలిని ఇదే తరహాలో పది మందికి పైగా వివాహం పేరిట మోసం చేసి.. వారి నుంచి భారీగా నగదు, నగలను దోచుకున్నట్లు తెలియవచ్చింది.