మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 6 ఫిబ్రవరి 2018 (12:27 IST)

భర్త నుంచి కాపాడాలంటూ భార్య అరణ్య రోదన (వీడియో)

ముంబైకు చెందిన ఓ మహిళ తన భర్త నుంచి కాపాడాలంటూ ట్విట్టర్‌లో వీడియో ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త నుంచి తనకు ప్రాణహాని పొంచివుందని ఆమె అందులో పేర్కొంది. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్

ముంబైకు చెందిన ఓ మహిళ తన భర్త నుంచి కాపాడాలంటూ ట్విట్టర్‌లో వీడియో ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త నుంచి తనకు ప్రాణహాని పొంచివుందని ఆమె అందులో పేర్కొంది. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
ఈ వీడియోలో బాధిత మహిళ తన గోడును చెబుతూ కనిపిస్తుంది. తన భర్త మరొక మహిళతో సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించింది. 'నా భర్త ఏళ్ల తరబడి నన్ను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు. పిల్లల భవిష్యత్ గురించి ఆలోచిస్తూ, ఈ రిలేషన్‌షిప్ కొనసాగిస్తున్నాను. 
 
నా భర్త నా కనీస అవసరాలు కూడా చూడటం లేదు. దయచేసి నాకు సాయం చేయండి. నేను చనిపోయే వరకూ అతను నన్ను టార్చర్ పెట్టేలావున్నాడు' అంటూ అందులో వాపోయింది. దీనిపై ముంబై పోలీసులు స్పందించి కేసు నమోదు చేసి ఆరా తీస్తున్నారు.