సంబంధిత వార్తలు
- ఆర్థిక ఇబ్బందులున్నవారు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించండి: జస్టిస్ కాంతారావు
- స్కూళ్లు తెరిచినా పిల్లల్ని పంపం : భారత్లో 92 శాతం మంది తల్లితండ్రుల మాట (Video)
- ప్రభుత్వ పాఠశాలల్లో త్వరితగతిన పనులు పూర్తి : మంత్రి ఆదిమూలపు సురేష్
- జూన్ 10 వరకు స్కూళ్లు, కాలేజీలకు సెలవు...ఎక్కడ?
- విద్యాలయాలు తెరిచేది అనుమానమే
ఆగస్టు 15 తర్వాతే విద్యాలయాలు పునఃప్రారంభం: స్పష్టత ఇచ్చిన కేంద్రం
దేశవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీల పునఃప్రారంభంపై కేంద్రం స్పష్టత ఇచ్చింది. కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి దేశంలో విద్యాసంస్థలు మూతపడిన సంగతి తెలిసిందే.
మార్చిలోనే స్కూళ్లకు, ఇతర విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చేశారు. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ సడలింపులు ఇస్తున్న నేపథ్యంలో విద్యాసంస్థల ప్రారంభం ఎప్పటి నుంచి అన్నది చర్చనీయాంశంగా మారింది.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పట్లో స్కూళ్లు, కాలేజీలు తెరవొద్దని తల్లిదండ్రుల నుంచి విజ్ఞప్తులు వస్తుండగా, కేంద్రం తన నిర్ణయాన్ని వెల్లడించింది.
కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ మాట్లాడుతూ, స్కూళ్లు, కాలేజీలు ఆగస్టు 15 తర్వాతే పునఃప్రారంభం అవుతాయని తెలిపారు.
ఈ లోపు అన్ని వార్షిక పరీక్షల ఫలితాలు వెల్లడించేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. కాగా, ఏపీలో స్కూళ్లను ఆగస్టు 3న తెరవాలని సర్కారు నిర్ణయించింది.
తర్వాతి కథనం
