శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 12 ఏప్రియల్ 2020 (05:17 IST)

జూన్‌ 10 వరకు స్కూళ్లు, కాలేజీలకు సెలవు...ఎక్కడ?

పశ్చిమ బెంగాల్‌లో కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు.  రాష్ట్రంలో జూన్ 10 వరకు స్కూళ్లు మూసివేయాలని నిర్ణయంచారు.

దేశంలో లాక్‌డౌన్‌ ప్రకటించిప్పుడు బెంగాల్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తక్కువగా ఉన్నాయి. కానీ గత మూడు వారాల్లో కేసులు సంఖ్య విపరీతంగా పెరిగింది. రాష్ట్రంలో దాదాపు 10 కరోనావైరస్‌ హాట్‌స్పాట్‌ కేంద్రాలను గుర్తించారు.

దీంతో రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తం అయింది. లాక్ డౌన్ కొనసాగింపు అంశం మీద ప్రధాని నరేంద్ర మోదీ తీసుకునే నిర్ణయాన్ని బట్టి ముందుకు వెళ్లాలని ఆమె నిర్ణయించారు.

అయితే, స్కూళ్ల విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వంగా ఓ నిర్ణయం తీసుకున్నారు. జూన్ 10 వరకు స్కూళ్లు తెరవొద్దని ప్రకటించారు. విద్యార్థుల పరీక్షలు, ఇతర అంశాల మీద మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.
 
మరోవైపు బెంగాల్లో లాక్ డౌన్ అమలు సరిగా జరగడం లేదంటూ కేంద్ర హోంశాఖ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సమయంలో కూడా మత పరమైన కార్యక్రమాలకు అనుమతులు ఇస్తున్నారంటూ అభ్యంతరం తెలిపింది.

లాక్ డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేయాలంటూ డీజీపీని ఆదేశించింది. కాగా, బెంగాల్‌లో ఇప్పటి వరకు 126  కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఐదుగురు మృతి చెందారు. ఇక దేశ వ్యాప్తంగా 7,447 మందికి కరోనా బారిన పడ్డారు. 239 మంది ప్రాణాలు కోల్పోయారు.