1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
  4. Mutton Keema Balls

మటన్ కీమా బాల్స్ ఎలా చేయాలి?

Mutton Keema Balls
మటన్‌లో ప్రోటీన్లు ఎక్కువ. ఇందులో జింక్, ఐరన్, సెలీనియం పుష్కలంగా ఉంటుంది. ఐరన్ శరీరంలోని హిమోగ్లోబిన్ స్థాయిని క్రమబద్ధీకరిస్తుంది. ఇందులోని విటమిన్ ఎ, బి, డీ దంతాలు, ఎముకలకు ఎంతో మేలు చేస్తుంది. అలాంటి మటన్‌తో కీమా బాల్స్ ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు:
మటన్ కీమా - అరకేజీ
కొత్తిమీర తరుగు - అర కప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - రెండు స్పూన్లు 
పచ్చిమిర్చి తరుగు - రెండు స్పూన్లు 
కారం - రెండు స్పూన్లు
ధనియాల పొడి - రెండు టీ స్పూన్లు 
నూనె, ఉప్పు - తగినంత 
 
తయారీ విధానం : 
ముందుగా మటన్ కీమాను ముందుగా శుభ్రం చేసి బాగా కడిగి తడిపోయే వరకు ఆరబెట్టాలి. మిక్సీలో సగం కొత్తిమీరను రుబ్బుకోవాలి. పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కొద్దిగా నీరు వేసి మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి. తర్వాత కారం, ఉప్పు, మటన్ కీమా, ధనియాల పొడి వేసి మెత్తగా చేయాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.

మరో పాత్రలో నీరు పోసి ఈ బాల్స్‌ని పది నిమిషాల పాటు బాగా ఉడికించాలి. నీటిని వడబోసి బాల్స్‌ను పేపర్ ప్లేటులోకి తీసుకోవాలి. తర్వాత బాణలిలో నూనె పోసి కాగాక ఈ బాల్స్‌ని నూనెలో బాగా వేయించి తీసేయాలి. అంతే మటన్ ఖీమా బాల్స్ రెడీ అయినట్లే. వీటిని సాస్‌తో సర్వ్ చేయొచ్చు.
About Writer
Selvi