ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. నాటి వెండి కెరటాలు
Written By ivr
Last Modified: సోమవారం, 23 మే 2016 (16:56 IST)

ప్రేమ బృందావనం పలికెలే స్వాగతం.. ప్రేమికులకు మరో లోకం...

ప్రేమికులను మరో లోకంలో ఓలలాడించే పాటలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ప్రత్యేకించి కొన్ని పాటలు మైమరపింపజేస్తాయి. బంగారు కానుక చిత్రంలోని 'ప్రేమ బృందావనం పలికెలే స్వాగతం...' పాట కూడా ఒకటి. ఈ పాటకు సంగీతం సత్యం సమకూర్చారు. సాహిత్యం- సాహితి. గానం చేసినవారు జి.

ప్రేమికులను మరో లోకంలో ఓలలాడించే పాటలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ప్రత్యేకించి కొన్ని పాటలు మైమరపింపజేస్తాయి. బంగారు కానుక చిత్రంలోని 'ప్రేమ బృందావనం పలికెలే స్వాగతం...' పాట కూడా ఒకటి. ఈ పాటకు సంగీతం సత్యం సమకూర్చారు. సాహిత్యం- సాహితి. గానం చేసినవారు జి. ఆనంద్, సుశీల.
 
ప్రేమ బృందావనం పలికెలే స్వాగతం..
ఆ రాముడు నా వరుడిగా చేరగా..
ప్రేమ బృందావనం ...
 
ప్రేమ బృందావనం పలికెలే స్వాగతం..
ఆ సీతే నా వధువుగా చేరగా
ప్రేమ బృందావనం....
 
పెళ్ళికే పాల మబ్బు పందిరే వేసెనయ్యా..
పచ్చనీ తీగలన్ని తోరణం చేసెనయ్యా ...
తారలే తలంబ్రాలై కురిసేనయ్యా ...
నా...కన్నులా...
కళ్యాణజ్యోతుల కాంతులు మెరిసే ...
 
ప్రేమ బ్రందావనం పలికెలే స్వాగతం...
 
గాలికే నీ అందం కవితలే నేర్పెనమ్మా...
వీణకే నీ గానం స్వరములే తెలెపెనమ్మా..
చందమామ నీ ముందూ ఎందుకే బొమ్మా....
ఆ...అమ్మమ్మా.... 
అపురూప సుందర అప్సర నీవు...
 
ప్రేమ బృందావనం పలికెలే స్వాగతం...
 
పాలలో తేనెవలే మనసులే కలిసెనయ్యా...
కలిపిన కొంగులు రెండూ విడిపోవమ్మా...
మా.. జంటనే ...
దీవించగా.. గుడి గంటలు మ్రోగే..
 
ప్రేమ బృందావనం పలికెలే స్వాగతం...
ఆ రాముడు నా వరుడిగా చేరగా..
ప్రేమ బృందావనం...
 
యూ ట్యూబ్ నుంచి పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి