1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
  4. Saturday puja for Lord venkaeswara

శనివారం శ్రీవారిని పూజించడం మరిచిపోవద్దు..

Saturday
శనివారం శ్రీ వేంకటేశ్వర స్వామిని పూజించడం విశేష ఫలితాలను పొందవచ్చు. శ్రీ వేంకటేశ్వర స్వామిని పూజిస్తే శని దోషం కూడా పోతుంది. అయితే శని దోషం పోవాలంటే కచ్చితంగా ఏడు వారాలు వెంకటేశ్వర స్వామిని పూజించాలి. అదే ఒకవేళ మహిళలకి వీలుకానప్పుడు ఆ వారం పూజ చేయలేకపోయినా మరుసటి వారం చేయొచ్చు.  
 
శనివారం నాడు ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రంగా చేసుకుని, స్నానం చేసి వెంకటేశ్వర స్వామిని అలంకరించి సంకల్పం చెప్పుకోవాలి. బియ్యం పిండి, పాలు, ఒక చిన్న బెల్లం ముక్క, అరటిపండు వేసి చపాతీలా చేసుకోవాలి. దానిలో ఆవు నెయ్యి వేసి దీపం పెట్టాలి.
 
ఆరోజు భక్తి శ్రద్ధలతో వేంకటేశ్వర స్వామిని పూజిస్తే మంచిది అని పురాణాలు చెబుతున్నాయి. అలానే శనివారం నాడు ఆవునేతితో కానీ నువ్వుల నూ నెతో కానీ దీపం వెలిగించి నమస్కారం చేసుకుంటే అష్ట ఐశ్వర్యాలు పొందచ్చు. 
 
శనివారం సాయంత్రం పూట వేంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి దీపం వెలిగించి నమస్కారం చేసుకుంటే బాధలు తొలగిపోయి సుఖసంతోషాలు కలుగుతాయి. కాబట్టి ఇలా ఈ విధంగా ఏడు వారాల పాటు ఏడుకొండలవాడిని పూజిస్తే ఎలాంటి సమస్యలనైనా బయటపడొచ్చునని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.
About Writer
సెల్వి