శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 సెప్టెంబరు 2021 (10:02 IST)

విజయనగరంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు చిన్నారుల బలి

విజయనగరంలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదం ఇద్దరు చిన్నారులను బలితీసుకుంది. వివరాల్లోకి వెళితే.. శనివారం ఉదయం చీపురుపల్లి మెయిన్ రోడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొడటంతో పాఠశాలకు వెళ్తున్న ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.
 
మృతి చెందిన ఇద్దరు బాలికలు చంద్రకి జ్ఞానేశ్వరి, చంద్రిక యోషితగా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.