1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. మనస్తత్వ శాస్త్రం
  4. negative behaviors others you should not allow in your life

ఎవరైతే మనకు సమస్యగా ఉంటారో.. వారిని..?

negative behaviors others you should not allow in your life
ఎవరైతే మనకు సమస్యగా ఉంటారో వారిని సాధ్యమైనంత వరకు దూరంగా ఉంచాలి. ప్రతికూలంగా ఉండే వ్యక్తులను దూరం చేసుకోవడం, అలాంటి వారితో స్నేహపూర్వకంగా ఎటువంటి విషయాలను పంచుకోకుండా ఉండటం మంచిది. ఎవరైనా మీతో ప్రతికూలంగా మాట్లాడానికి ప్రయత్నిస్తుంటే, మీ ఆలోచనలను అభిప్రాయాలను అగౌరవపరుస్తుంటే, వారి అటువంటివారి మీ జీవితంలోకి ఆహ్వానించకూడదని గుర్తుంచుకోవాలి. మీకు అనుకూలంగా, మీ మేలు కోరే వారిని ఎంపిక చేసుకొని స్నేహితులుగా చేసుకోవాలి.
 
అలాగే మిమ్మల్ని డిస్కరేజ్ చేసేవారిని దూరంగా ఉంచాలి. నిజాయితీని కలిగి ఉండాలి. అలాగే మీకంటే డిఫరెంట్‌గా ఆలోచించే అవకాశం ఉండేవారిని పక్కనబెట్టుకోవాలి. అలాగే మీ శక్తి సామర్థ్యాలను నమ్మే వారుగా ఉండాలి. మీతోనే ఉంటూనే చెడును కోరుకునే వారు.. మంచిని ఆశించకపోయేవారిని సాధ్యమైనంత వరకు దగ్గర చేర్చకుండా ఉండటం ఎంతైనా మంచిదని మానసిక నిపుణులు అంటున్నారు. 
About Writer
Selvi