1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. మనస్తత్వ శాస్త్రం
  4. woman walk can reveal her romantic ability

మహిళ నడకతోనే ఆమె శృంగార శక్తి ఎంతటిదో చెప్పొచ్చట...

పరిశోధకులు ఎప్పటికప్పుడు మానవులలో వున్న అన్ని కోణాలపై అధ్యయనం చేస్తూ వుంటారు. మహిళల నడకను బట్టే వారిలో ఉన్న శృంగార తృష్ణ, దక్షతను చెప్పవచ్చని అమెరికాకు చెందిన శృంగార శాస్త్రవేత్తలు చెపుతున్నారు. స్కాట

woman
పరిశోధకులు ఎప్పటికప్పుడు మానవులలో వున్న అన్ని కోణాలపై అధ్యయనం చేస్తూ వుంటారు. మహిళల నడకను బట్టే వారిలో ఉన్న శృంగార తృష్ణ, దక్షతను చెప్పవచ్చని అమెరికాకు చెందిన శృంగార శాస్త్రవేత్తలు చెపుతున్నారు. స్కాట్‌ల్యాండ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన స్టూవర్ట్ బ్రాడీ నేతృత్వంలోని పరిశోధక బృందం ఈ విషయాన్ని తేల్చింది. ఈ బృందం వివిధ ప్రాంతాలలోని బహిరంగ ప్రదేశాలలో మహిళలు నడకను చిత్రీకరించారు. ముందుగా ప్రత్యేకంగా తయారు చేసిన ప్రశ్నావళికి వారి వద్ద నుంచి సమాధానం రాబట్టారు. శృంగారంలో పాల్గొన్నపుడు వారి ప్రవర్తనకు సంబంధించిన ప్రశ్నలను అందులో పొందుపరిచారు. 
 
సెక్సాలజీకి సంబంధించిన ఇద్దరు ప్రొఫెసర్లు ఈ చిత్రీకరణలను పలురకాలుగా విభజించారు. మహిళల లైంగిక అవయవ నిర్మాణంపై శాస్త్రీయంగా ఎటువంటి అవగాహన లేని ఇద్దరు వ్యక్తులు విభజనలో ప్రొఫెసర్లకు సహరించారు. వీరు ఫంక్షనల్ సెక్సాలజీలో శిక్షణ పొందిన వారు మాత్రమే. మహిళల ఆర్గానిజంపై ఎటువంటి అవగాహన లేకపోయినా వారు మహిళల నడకను గమనించి వారిలో ఉన్న తృష్ణ, దక్షత ఊహించగలిగారు. 
 
విశ్లేషణల ప్రకారం పెద్ద పెద్ద అంగలతో, నడుము తిప్పుతూ నడిచే వారు మంచి శృంగార అవయాలను కలిగి ఉంటారని నిర్ణయించారు. సరిగ్గా సైకాలజిస్టులు, వీరు చెప్పిన అభిప్రాయాలు చాలా మటుకు ఏకీభవించాయి. ఈ విధమైన నడక వలన కాళ్లు నుంచి కటి ద్వారా వెన్నెముకకు శక్తి లభిస్తుంది. మహిళ శరీర సౌష్టవం కూడా వారిలో లైంగిక అవయవాల పటిష్టత, దక్షతకు సూచికగా నిలుస్తుందని పరిశోధనలో వెల్లడైంది. 
 
మొద్దుబారిపోయిన కటి కండరాలకు లైంగిక వాంఛలకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నట్లు బ్రాడీ తెలిపారు. కండరాలు మొద్దుబారి పోవడం వలన ఈ వాంఛ తగ్గే అవకాశం ఉందన్నారు. లైంగిక అవయవాలు పటిష్టంగా ఉన్న మహిళలలో శృంగార విశ్వాసం ఉట్టి పడుతుంటుంది. అదేవారి నడకపై ఆధార పడి ఉంటుంది. ఆ విశ్వాసం కూడా లైంగికంగా ఆమెకున్న సంబంధం, సంతృప్తి తీవ్రతను అనుసరించి ఉంటుంది.
About Writer
ivr
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి
తర్వాతి కథనం
వ్యాధులకు దూరంగా ఉండాలంటే.. ఉదయం - సాయంత్రం వేళల్లో ఎండలో కూర్చోండి!