1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Health did not permit: Mammootty - Characters in 'Om' will speak in Telugu: Dhanush

Dhanush: ఆరోగ్యం సహకరించలేదు : మమ్ముట్టి - ఓం లో పాత్రలు తెలుగులోనే మాట్లాడతాయి : ధనుష్

Mammootty, Dhanush, Sai Pallavi, Sreeleela, Rajkumar Periasamy
Mammootty, Dhanush, Sai Pallavi, Sreeleela, Rajkumar Periasamy
ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల ప్రధాన పాత్రల్లో రాజ్ కుమార్ పెరియసామి తెరకెక్కించిన చిత్రం ‘ఓం ఛాప్టర్ 1 – రుధిరం: ది బ్లడ్ వుడ్’. ఈ మూవీని రెండు తెలుగు రాష్ట్రాల్లో సితార ఎంటర్టైన్మెంట్స్ నవంబర్ 20న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోంది. ఈ క్రమంలో సోమవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించారు. వండర్‌బార్ ఫిల్మ్స్, ఆర్ టేక్ స్టూడియోస్ బ్యానర్లపై శ్రద్దా అగర్వాల్ నిర్మాణంలో రూపొందింది.
 
మమ్ముట్టి మాట్లాడుతూ, ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకమైనది. మొదట ఆరోగ్యం సహకరించకపోవడంతో షూటింగ్ కొంతకాలం వాయిదా వేయాలని దర్శకుడిని కోరాను. అందుకు ఆయన అంగీకరించారు. ఈ సినిమా కోసం దర్శకుడు, ధనుష్, రేణు దేశాయ్, సాయి పల్లవితో పాటు సాంకేతిక బృందం ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడ్డారు. రేణు దేశాయ్, ధనుష్‌లతో కలిసి ఎక్కువ సన్నివేశాల్లో నటించాను. సాయి పల్లవిలోని అద్భుతమైన ఎనర్జీ నాకూ ఉత్సాహాన్నిచ్చింది. వీళ్లందరితో కలిసి పనిచేయడం చాలా సరదాగా అనిపించింది. ఈ సినిమా సాధారణమైనది కాదు. అన్ని రకాల అంశాలు ఇందులో ఉంటాయి. ప్రేక్షకులందరికీ ఈ సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నాను. నవంబర్ 20న థియేటర్లకు వచ్చి మా సినిమాను ఆదరించండి. అందరికీ ధన్యవాదాలు’ అని అన్నారు.
 
ధనుష్ మాట్లాడుతూ* .. ‘‘ఓం’ సినిమాలో చాలా పాత్రలు తెలుగులోనే మాట్లాడతాయి. దాదాపుగా ఇది ద్విభాషా చిత్రం. తిరుపతి, తిరుమల, తిరువణ్ణామలై వంటి రెండు పుణ్యక్షేత్రాల నేపథ్యంలో సాగే ఈ కథలో తెరపై కనిపించే అంశాల కంటే చాలా లోతైన భావాలు దాగి ఉన్నాయి. ఇలాంటి అద్భుతమైన కథను తెరపైకి తీసుకురావడంలో దర్శకుడు రాజ్‌కుమార్ ప్రతిభ ఎంతో ఉంది. ప్రతి పాత్రకు తగిన ప్రాధాన్యత, స్క్రీన్ టైమ్ ఇచ్చి అద్భుతంగా తెరకెక్కించారు. ఈ విషయంలో సగం క్రెడిట్ దర్శకుడికి దక్కితే, మిగిలిన సగం క్రెడిట్ నిర్మాత శ్రద్ధకు ఇవ్వాలి. ఆమె దర్శకుడి విజన్‌ను నమ్మి మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల వంటి గొప్ప నటీనటులను ఒకే సినిమాలో భాగం చేశారు. 
 
సినిమాలో నటించిన తెలుగు నటీనటులందరూ కూడా అద్భుతంగా నటించారు. ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఈ సినిమా కోసం మేమంతా ఎంతో కష్టపడ్డాం. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ఆదరిస్తారు. ఇక్కడ మంచి చిత్రాలను సెలెబ్రేట్ చేస్తుంటారు. అలా ఆడియెన్స్ అందరూ సెలెబ్రేట్ చేసుకునేలా ‘ఓం’ చిత్రం ఉంటుంది. ‘ఓం’ సినిమా అందరికీ నచ్చుతుందని, అందరూ ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. ప్రస్తుతం మొబైల్ ఫోన్లలోనే ఎన్నో రకాల వినోదాలు అందుబాటులో ఉన్నప్పటికీ, థియేటర్లకు వచ్చి సినిమాలను ఆదరిస్తున్న ప్రేక్షకుల వల్లే సినిమా పరిశ్రమ ముందుకు సాగుతుంది. చెన్నై అయినా, హైదరాబాద్ అయినా మీరు నాపై చూపిస్తున్న ప్రేమ, అభిమానం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నవంబర్ 20న థియేటర్లలో కలుద్దాం. మా సినిమాను చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
 
సాయిపల్లవి మాట్లాడుతూ, నేను తొలిసారి ఐపీఎస్ అధికారిణి పాత్రలో నటించాను. మన రోజువారీ జీవితం ప్రశాంతంగా సాగడానికి పోలీసులు ఎంతో హెల్ప్ చేస్తారు. మన భద్రత కోసం వాళ్లు ఎన్నో త్యాగాలు చేస్తుంటారు. అలాంటి పోలీస్ అధికారులందరికీ ఈ సందర్భంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారి జీవితాలు, బాధ్యతలను దృష్టిలో పెట్టుకుని ఈ పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దిన దర్శకుడికి మరోసారి కృతజ్ఞతలు.అన్నారు.
 
శ్రీలీల మాట్లాడుతూ, నా మెడిసిన్ పూర్తయిన తర్వాత ముంబైలో ఇంటర్న్‌షిప్ చేస్తున్న సమయంలో నాకు కొన్ని సినిమా అవకాశాలు వచ్చాయి. కానీ నేను అప్పుడు రెడీగా లేను. అదే సమయంలో ఈ సినిమా కథ విన్నాను. నాకు కథ చాలా బాగా నచ్చింది. దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆయనను మొదటిసారి కలిసినప్పుడు ఈ సినిమాలో పాటలు ఉండవని చెప్పారు. అది నాకు చాలా కొత్తగా, రిఫ్రెషింగ్‌గా అనిపించింది. ఈ సినిమాలో నేను పూర్తిగా కొత్తగా కనిపిస్తాను. నా కెరీర్‌లో ఈ సమయంలో ఇలాంటి సినిమా చేయడం చాలా ముఖ్యం. ధనుష్ గారితో సినిమా చేస్తే ఆయన మనల్ని ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తారు. ఆయనతో కలిసి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఒక నటిగా ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. అలాగే మమ్ముట్టి గారు ఎంత పెద్ద ప్రశ్నకైనా చాలా చిన్న సమాధానంతో అద్భుతంగా స్పందిస్తారు. ఆయన నుంచి ఆ విషయాన్ని నేర్చుకున్నాను. నేను డాక్టర్‌గా చదువుకుంటున్న సమయంలో సాయి పల్లవి నటించిన ‘ఫిదా’ సినిమా విడుదలైంది. ఒక డాక్టర్ అమ్మాయి సినిమాలో హీరోయిన్‌గా నటించడం చూసి చాలా గొప్పగా అనిపించింది. ఇక రేణు దేశాయ్ గారు 20 ఏళ్ల క్రితం ఎలా ఉన్నారో ఇప్పటికీ అలాగే ఎంతో అందంగా ఉన్నారు’ అని మాట్లాడారు.
 
రేణు దేశాయ్ మాట్లాడుతూ, మమ్ముట్టి గారి ముందు నిలబడి మాట్లాడాలంటే నిజంగా మాటలు రావడం లేదు. ఈ సినిమా గురించి ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. నాకు ఈ సినిమా ఆఫర్ ఫిబ్రవరిలో వచ్చింది. అప్పుడు మహాశివరాత్రి. ఆ టైమ్‌లో నేను కామాఖ్యలో ఉన్నాను. అప్పుడు నాకు ఈ సినిమా ఆఫర్ వచ్చింది. అంటే ఇది ఖచ్చితంగా దైవ నిర్ణయమే. ఈ కార్యక్రమానికి దర్శకుడు రాజ్‌కుమార్ హాజరుకాకపోవడం కొంత బాధగా ఉంది. ఆయనను చాలా మిస్ అవుతున్నాను. ఈ సినిమా కోసం పనిచేసిన టీమ్ మొత్తానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు’ అని అన్నారు.
About Writer
దేవీ
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
Rocking Star Yash: రామాయణం తో రాకింగ్ స్టార్ యశ్ కు బిగ్ ఆఫర్ ?