నీటితో వ్యాధిని మాయం చేస్తా...
|
రోగులకు ఆమె చేసే చికిత్స కూడా విభిన్నంగా ఉంటుంది. రోగిని తన ఇంటివద్ద నుంచి నీటిని తీసుకురమ్మంటుంది. అదే జలాన్ని రోగగ్రస్తమైన ప్రదేశంలో చిలకరిస్తుంది. ఈ తంతు ముగిసిన తర్వాత రోగి ఆ నీటిని తాగేయాలి. రోగి ఈ నీటితోపాటు పూవులు, అరటిపండ్లు వంటివాటిని తీసుకోవాలి. అంతేకాదు రోగి శరీరంపైన తడిపూవులను బాగా రుద్దుతుంది.
ఆమె చికిత్సను పొందటానికోసం రకరకాల మనుషులు, రకరకాల వ్యాధి బాధలతో ఆమె గుమ్మం ముందు బారులు తీరి సమస్యను వదిలించుకునేందుకు ఎదురుచూస్తుంటారు. తనకు దివ్యశక్తులు ఉన్నాయనీ, అందువల్లనే కేవలం నీటితో చికిత్స సాధ్యమవుతోందని ఇందిరాదేవి ప్రకటించుకుంటుంది. అంతేకాదు ఆమె చేతి స్పర్శతో దుఃఖం, శరీరంలో ఉన్న ఇతర రుగ్మతలు మటుమాయమవుతాయట.
|
తను చేసే ఏ చికిత్సకు రోగుల వద్ద ఎటువంటి రుసుము తీసుకోనని చెపుతోంది ఇందిరాదేవి. అయితే ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న వ్యవహారం మరో రకంగా కనబడుతోంది. ఈ విషయంపై ఆమెను ఆరాతీస్తే, రోగులు తమకు తాముగా రూ.20 నుంచి రూ.50 చెల్లించే డబ్బు విషయమై తానేమే చేయలేననీ అంటోంది. అయినా ఇందులో తప్పేముంది.. వారి రోగం నయమవటానికంటూ ఓ ఇరవయ్యో యాభయ్యో ఇస్తున్నారంతే అంటోంది.
|
|
|
