జగన్నాథ రథయాత్ర....
|
ఆ రోజున, అహమ్మదాబాద్‌లోని జగన్నాథ ఆలయం నుంచి భారీ స్థాయిలో ఊరేగింపు మొదలవుతుంది. ఈ ఊరేగింపులో మూడు రథాలు పాల్గొంటాయి. మొదటిది జగన్నాథ రథం, రెండోది సుభద్రాదేవి రథం, మూడోది భలబద్రుడి రథం. నగరం లోని అన్ని వీధులగుండా ఈ యాత్ర ఊరేగింపుగా సాగుతుంది. వందలాది సాధువులు, వేలాది భక్తులు ఈ ఊరేగింపులో భక్తి పారవశ్యంతో పాల్గొంటారు. ఆ సమయంలో వాతావరణం మొత్తం భక్తి విశ్వాసాలతో నిండిపోతుంది.
అకడాలు -ప్రజలు వ్యాయామం చేసే సాంప్రదాయక వ్యాయామ శాలలు- ఈ ఊరేగింపులో అగ్రభాగాన నిలుస్తారు. ఈ అకడాలలోని సభ్యులు జగన్నాథుడిపై తమ విశ్వాసాన్ని ప్రదర్శించుకోవడానికి అద్భుతరీతిలో వ్యాయామకళను ఊరేగింపులో ప్రదర్శిస్తారు.
ఊరేగింపు సందర్భంగా నగరం దేదీప్యమానంగా వెలిగిపోతుంది. నగరంలోని అన్ని మూలల్లోనూ జగన్నాథుడి పట్ల భక్తి పొంగి పొరలుతూ ఉంటుంది. నగర వీధుల్లో
|
ఇక్కడి సంప్రదాయం ప్రకారం జగన్నాథ ఆలయాన్ని మొదటగా గజరాజు సందర్శిస్తుంది. తర్వాత ప్రభుత్వ ఉన్నతాధిపతి - ఈ రోజుల్లో ముఖ్యమంత్రి- బంగారు పొరకతో ఆ స్థలాన్ని శుభ్రపర్చిన తర్వాత జగన్నాథుడు ఆసీనుడైన రథం పురవీధుల గుండా సాగిపోతుంది. ఉదయం ఆలయం నుంచి ప్రారంభమయ్యే రథయాత్ర కాస్సేపు విశ్రాంతి తీసుకోవడానికి సరస్‌పూర్ ప్రాంతంలో మజిలీ చేస్తుంది. విరామ సమయంలో, రథయాత్రలో పాల్గొంటున్న వారికి ఆహారం అందిస్తారు. ఆ రోజున దాదాపు లక్షమంది యాత్రికులు ఇక్కడ భోంచేస్తారని ప్రతీతి.
|
సాంప్రదాయికంగా పడవ నడిపే జాలర్లకు మాత్రమే రథయాత్రను మొదటగా లాగే హక్కు ఉంటూ వచ్చింది. భరూచ్ ప్రాంత జాలర్లు మొట్టమొదటి రథయాత్రకు రథాన్ని అందించారని చెప్పబడుతోంది. అయితే ప్రస్తుతం రథయాత్రలో పాల్గొనే ప్రతి ఒక్కరూ రథాన్ని తామే లాగాలని దేవుడిని సేవించాలని భావిస్తుంటారు.
రథయాత్ర మరోవైపు మత సామరస్యానికి ప్రతీకగా కూడా ఉంటోంది. ఆ రోజు ఆలయ పూజారికి ముస్లింలు స్వాగతం పలుకుతారు. రథయాత్రలో తాటిముంజ, బెర్రీలను దేవుడికి సమర్పిస్తారు. కిచడి -బియ్యం, పప్పు కలిపి చేసే వంట-, గుమ్మడికాయ పాయసాన్ని దేవుడికి ప్రసాదంగా సమర్పిస్తారు.
ఎలా చేరుకోవాలి: రైలు రోడ్డు మార్గం ద్వారా దేశంలోని అన్ని ప్రాంతాలనుంచి అహమ్మదాబాద్‌కు చేరుకోవచ్చు.
