1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
  4. Fans shocked as YouTube blocks MS' Vishnu Sahasranamam

సుబ్బులక్ష్మి విష్ణు సహస్రనామాల లింకులు బ్లాక్.. ఎందుకు? నెటిజన్ల ఆవేదన

Fans
ఎంఎస్ సుబ్బులక్ష్మి అభిమానులకు నిరాశ ఎదురవుతోంది. గత రెండు రోజులుగా యూట్యూబ్‌లో ఎంఎస్ సుబ్బులక్ష్మి ఆలపించిన విష్ణు సహస్రనామాల యూట్యూబ్ లింకులను కూడా బ్లాక్ చేశారు. దీనిపై నెటిజన్లు, ఎంఎస్ సుబ్బులక్ష్మి అభిమానులు, సంగీత ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో వెల్లడిస్తున్నారు. 
 
2014లో కూడా ఇదేవిధంగా త్యాగరాజస్వామి కీర్తనలను బ్లాక్ చేశారని నెటిజన్లు ఆరోపించారు. కాగా దీనిపై ప్రముఖ గాయకుడు లలితారామ్ మాట్లాడుతూ కాపీరైట్ సమస్య కారణంగా ఎంఎస్ సుబ్బులక్ష్మి విష్ణు సహస్రనామాలను బ్లాక్ చేశారని వెల్లడించారు. అంతేగాకుండా ఇదేశైలిని అనుసరించి ఉన్న అన్ని వెబ్ సైట్‌లను బ్లాక్ చేశారని వివరించారు.
About Writer
Selvi