1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
  4. Shirdi's Sai Baba temple Hundi Collection

రికార్డు స్థాయిలో షిరిడీ సాయిబాబా హుండీ ఆదాయం...

మహారాష్ట్రలోని షిర్డిలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన సాయిబాబా దేవాలయానికి భక్తుల నుంచి విరాళాలు భారీ ఎత్తున వస్తున్నాయి. గడిచిన తొమ్మిది రోజుల్లో దాదాపు 9 లక్షలకుపైగా భక్తులు ఈ దేవాలయాన్ని దర్శించుకున్

Shirdi's Sai Baba temple Hundi Collection
మహారాష్ట్ర షిర్డిలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన సాయిబాబా దేవాలయానికి భక్తుల నుంచి విరాళాలు భారీ ఎత్తున వస్తున్నాయి. గడిచిన తొమ్మిది రోజుల్లో దాదాపు 9 లక్షలకుపైగా భక్తులు ఈ దేవాలయాన్ని దర్శించుకున్నారని షిరిడీ దేవస్థానం చెబుతోంది.
 
అయితే సాయిబాబా ఆలయ ఖజానాకు తొమ్మిది రోజుల్లో 9 కోట్ల 84 లక్షల రూపాయలు విరాళాలు వచ్చినట్లు దేవాలయ అధికారులు చెప్పారు. హుండీల ద్వారా రూ.5.35 కోట్లు, కౌంటర్ల ద్వారరా రూ.1.49 కోట్లు వచ్చాయని ఆలయ అధికారులు చెబుతున్నారు. 
 
విఐపి దర్శనం పాస్‌ల ద్వారా 1.23కోట్లు, మనీ ఆర్డర్ల ద్వారా రూ.2.31 కోట్లు దేవాలయానికి విరాళాల రూపంలో వచ్చినట్లు చెప్పారు. రికార్డు స్థాయిలో ఈ హుండీ ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. 
About Writer
ttdj
తర్వాతి కథనం
అన్నం పరబ్రహ్మస్వరూపం అని ఎందుకంటారంటే..!