ఆదివారం, 23 ఫిబ్రవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ttdj
Last Updated : బుధవారం, 4 జనవరి 2017 (14:59 IST)

6 నుంచి కపిలేశ్వరస్వామి తెప్పోత్సవాలు

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయంలో జనవరి 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. ఐదు రోజుల పాటు జరిగే తెప్పోత్సవాలలో మొదటి రోజైన జనవరి 6వ తేదీన శ్రీ వినాయక స్వామివా

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయంలో జనవరి 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. ఐదు రోజుల పాటు జరిగే తెప్పోత్సవాలలో మొదటి రోజైన జనవరి 6వ తేదీన శ్రీ వినాయక స్వామివారు పుష్కరిణిలో ఐదు చుట్లు విహరిస్తారు. రెండవరోజు శ్రీ సుబ్రమణ్యస్వామి వారు ఐదు చుట్లు, మూడవరోజు శ్రీ సోమస్కందస్వామివారు ఐదు చుట్లు, నాలుగవరోజు కామాక్షి అమ్మవారు ఏడుచుట్లు, ఐదోరోజు శ్రీ చండీకేశ్వరస్వామివారు, శ్రీ చంద్రశేఖర స్వామివారు తెప్పలపై ఏడు చుట్లు తిరిగి భక్తులకు దర్శనమిస్తారు. 
 
ప్రతిరోజు సాయంత్రం 6.30 నుంచి 7.30 గంటల వరకు తెప్పోత్సవాలు నిర్వహిస్తారు. జనవరి 11వ తేదీన ఆరుద్ర దర్శన మహోత్సవం ఉదయం 5.30 నుంచి 9.30 గంటల వరకు శ్రీ నటరాజస్వామివారు, శ్రీ శివగామి అమ్మవారు, శ్రీ మాణిక్య వాసగ స్వామివారి ఉత్సవ విగ్రహాలను పురవీధులలో ఊరేగించనున్నారు. తెప్పోత్సవాల సంధర్భంగా తితిదే అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ భక్తి సంకీర్తనలు ఆలపిస్తారు.