1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
  4. CFA Institute Hosts its First Finance Industry Network Roundtable in Hyderabad to Strengthen Academia-Industry Collaboration

హైదరాబాద్‌లో తొలి ఫైనాన్స్ ఇండస్ట్రీ నెట్‌వర్క్ రౌండ్‌టేబుల్‌ను నిర్వహిస్తున్న సీఎఫ్ఏ ఇన్‌స్టిట్యూట్

First Finance Industry Network Roundtable
హైదరాబాద్: సిఎఫ్ఏ ఇన్‌స్టిట్యూట్, పెట్టుబడి నిపుణుల గ్లోబల్ అసోసియేషన్, ఇటీవల హైదరాబాద్‌లో తన తొలి ఫైనాన్స్ ఇండస్ట్రీ నెట్‌వర్క్ రౌండ్‌టేబుల్‌ను నిర్వహించింది. ఫైనాన్స్ విద్యకు, ప్రపంచ పెట్టుబడి వృత్తి యొక్క మారుతున్న అవసరాలకు మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడంపై చర్చించడానికి, నగరంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల నుండి విద్యావేత్తలు మరియు ఫైనాన్స్ అధ్యాపకులను ఈ రౌండ్‌టేబుల్ ఒకచోట చేర్చింది.
 
సిఎఫ్ఏ ఇన్‌స్టిట్యూట్ విశ్వవిద్యాలయ భాగస్వామ్య కార్యక్రమాలను పరిచయం చేయడం, ఆర్థిక విద్యకు సంబంధించిన అభిప్రాయాలు, అనుభవాల పరస్పర మార్పిడికి వేదిక కల్పించడం, అలాగే విద్యాసంస్థలు–పరిశ్రమల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసే అవకాశాలను అన్వేషించడం లక్ష్యంగా ఈ FIN రౌండ్‌టేబుల్‌ నిర్వహించబడింది.
 
ఈ సమావేశం సిఎఫ్.ఏ ప్రోగ్రామ్®, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన దాని ప్రాక్టీషనర్-ఆధారిత పాఠ్యప్రణాళిక, మరియు అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫైనాన్స్ విద్యకు దాని ప్రాముఖ్యతపై ఒక అవలోకనాన్ని అందించింది. ఫైనాన్స్ రంగంలో వృత్తి జీవితానికి అవసరమైన పరిశ్రమకు సంబంధించిన జ్ఞానం, నైతిక నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాలు, మరియు ఆచరణాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో విద్యార్థులకు మరియు అధ్యాపకులకు మద్దతు ఇచ్చే సి.ఎఫ్.ఏ ఇన్‌స్టిట్యూట్ యొక్క విస్తృత శ్రేణి అభ్యాస మార్గాలు మరియు కార్యక్రమాలను కూడా ఈ చర్చలు ప్రముఖంగా ప్రస్తావించాయి.
 
రౌండ్‌టేబుల్‌ సమావేశంలో మాట్లాడుతూ, మిస్టర్ సైమ్ ఫకీహ్, మేనేజర్, యూనివర్సిటీ రిలేషన్స్–ఇండియా, సిఎఫ్‌ఏ ఇన్‌స్టిట్యూట్, ఇలా అన్నారు “భారతదేశవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలతో మా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా హైదరాబాద్ FIN రౌండ్‌టేబుల్ ఒక కీలక మైలురాయిగా నిలిచింది. నిరంతరం మారుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాలనే అధ్యాపకులు, పరిశ్రమ భాగస్వాముల ఉమ్మడి నిబద్ధతను ఈ చర్చలు స్పష్టంగా ప్రతిబింబించాయి.
 
ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశాల్లో, గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు (GCCలు)లో ఉద్యోగాలు పొందుతున్న విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటం ఒకటి. ఇది ఆర్థిక సేవల రంగంలో హైదరాబాద్ ప్రముఖ కేంద్రంగా వేగంగా ఎదుగుతున్న విషయాన్ని సూచిస్తోంది. అనేక బహుళజాతి సంస్థలు ఈ నగరంలో తమ కార్యకలాపాలను స్థాపిస్తూ, విస్తరిస్తున్న నేపథ్యంలో, హైదరాబాద్ నిరంతర వృద్ధికి అనుకూలమైన స్థితిలో ఉంది. అలాగే, ఆర్థిక రంగంలో విజయవంతమైన వృత్తి జీవితాన్ని నిర్మించాలనుకునే వారికి విస్తృత అవకాశాలను అందిస్తోంది.”
 
ఈ రౌండ్‌టేబుల్‌ సమావేశంలో IMT హైదరాబాద్, వోక్సన్ యూనివర్సిటీ, NMIMS హైదరాబాద్, గీతం యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, మరియు సెయింట్ జోసెఫ్స్ డిగ్రీ & పిజి కాలేజ్ వంటి హైదరాబాద్‌లోని ప్రముఖ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
 
మిస్టర్ దీపక్ సింగ్ పరిహార్,  ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్, వోక్సన్ యూనివర్సిటీ ఇలా వ్యాఖ్యానించారు, ఇతర విద్యాసంస్థల విద్యావేత్తలతో కలిసి CFA ఇన్‌స్టిట్యూట్ నిర్వహించిన FIN రౌండ్‌టేబుల్‌లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా విద్యార్థులను పరిశ్రమ అవసరాలకు మరింత సిద్ధంగా తీర్చిదిద్దే మార్గాలు, అలాగే వారి వృత్తి ప్రయాణంలో సిఎఫ్ఏ ప్రోగ్రామ్ పోషించే పాత్రపై మేము చర్చలు జరిపాము. విద్యార్థులు తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునేందుకు అందుబాటులో ఉన్న వివిధ అవకాశాలు, మా పాఠ్యప్రణాళికను మరింత సమకాలీనంగా, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా రూపొందించే మార్గాలు, ఉపాధి అవకాశాలు, అలాగే అధ్యాపకుల భాగస్వామ్యం, విద్యార్థి-కేంద్రీకృత కార్యక్రమాల ద్వారా విద్యాసంస్థలు–పరిశ్రమల మధ్య మరింత బలమైన సహకారాన్ని పెంపొందించే అవకాశాలపై కూడా అభిప్రాయాలు పంచుకున్నాము. పరిశ్రమ–విద్యాసంస్థల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం, పెట్టుబడి రంగంలో కెరీర్‌లకు విద్యార్థులను మరింత సమర్థంగా సిద్ధం చేయడం అనే ఉమ్మడి లక్ష్యంతో ఈ సమావేశం విజయవంతంగా ముగిసింది.
 
మిస్టర్ శరత్ బాబు, అసోసియేట్ ప్రొఫెసర్ & ఏరియా చైర్- ఫైనాన్స్ & అకౌంటింగ్, IMT హైదరాబాద్ ఇలా అన్నారు: హైదరాబాద్‌లో CFA ఇన్‌స్టిట్యూట్ నిర్వహించిన తొలి FIN రౌండ్‌టేబుల్‌కు ఆహ్వానించబడటం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా ఆర్థిక విద్య, ఫైనాన్స్ రంగం వేగంగా రూపాంతరం చెందుతున్న తీరు, అలాగే పరిశ్రమలో చోటుచేసుకుంటున్న మార్పులపై మేము సానుకూల చర్చలు జరిపాము. పెట్టుబడి నిర్వహణ రంగంలో తాజా పరిణామాలను అర్థం చేసుకోవడంలో, అలాగే విద్యార్థులను పరిశ్రమ అవసరాలకు మరింత సమర్థంగా సిద్ధం చేయడంలో CFA ప్రోగ్రామ్ ఎలా తోడ్పడుతుందనే అంశంపై కూడా చర్చించాము
About Writer
ఐవీఆర్
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT) హైదరాబాదులో సిపిఎఫ్‌సి కోర్సు చేసారు. జర్నలిజంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం. కవితలు, కథలు రాస్తుంటారు. ప్రముఖ మీడియా సంస్థలలో పనిచేసారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
అస్సాంలో పదవ తరగతి విద్యార్థిపై హత్యాచారం.. ఫంక్షన్‌కు వెళ్లిన తల్లి.. మంచంపై విగతజీవిగా..?