1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Nanakramguda: Software Techie Dies After Falling From 30th Floor

Nanakramguda: 30వ అంతస్థు నుంచి కిందపడి 29 ఏళ్ల టెక్కీ మృతి

crime
crime
హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో సోమవారం రాత్రి ఒక భవనం 30వ అంతస్థు నుంచి కింద పడి 29 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి చెందారు. మృతుడిని భరత్‌గా గుర్తించారు. పోలీసుల వివరాల ప్రకారం, అతను రెండు రోజుల క్రితమే నానక్‌రామ్‌గూడలోని ఒక అపార్ట్‌మెంట్‌కు అద్దెకు మారాడు. 
 
అతను బెంగళూరులోని ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి భరత్ భవనం 30వ అంతస్తు నుంచి కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని అతన్ని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
 
అయితే ఆసుపత్రికి చేరుకునేసరికే అతను మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. అతని బంధువు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
ఎన్టీఆర్ జిల్లాలోని వెస్ట్ బైపాస్‌లో ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి