1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Telangana CM cancels US visit after Centre denies permission

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి యూఎస్ పర్యటన రద్దు

Revanth Reddy
విదేశీ వ్యవహారాల శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారని ముఖ్యమంత్రి కార్యాలయం శుక్రవారం తెలిపింది. యునైటెడ్ కింగ్‌డమ్, అమెరికాలో 10 రోజుల పర్యటన కోసం బుధవారం రాత్రి లండన్‌కు బయలుదేరిన ముఖ్యమంత్రి, యూకేలో తన కార్యక్రమాలు పూర్తయిన తర్వాత భారతదేశానికి తిరిగి వస్తారు.
 
ముఖ్యమంత్రి నేతృత్వంలోని అధికారిక బృందం ఆగస్టు 23న అమెరికాకు బయలుదేరాల్సి ఉంది. ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం, "రాజకీయ కోణంలో అనుమతి నిరాకరించబడింది" అని పేర్కొంటూ విదేశీ వ్యవహారాల శాఖ అనుమతిని తిరస్కరించడంతో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని అధికారిక బృందం తమ అమెరికా పర్యటనను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. 
 
విధానం, ప్రోటోకాల్ ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం యూకే, అమెరికా పర్యటన కోసం కేంద్రం అనుమతి కోరింది. అయితే యూకే పర్యటనకు మాత్రమే ఆమోదం లభించింది. అధికారిక బృందం యూకే చేరుకున్న తర్వాత కేంద్రం అనుమతి నిరాకరణ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసిందని సీఎంవో పేర్కొంది.
 
కేంద్రం నూతన విద్యా విధానంలో భాగంగా, ప్రపంచంలోని అత్యుత్తమ విద్యా సంస్థలను భారతదేశానికి, తెలంగాణకు, హైదరాబాద్‌కు తీసుకురావడమే ఈ పర్యటన ఏకైక ఉద్దేశ్యమని తెలంగాణ సీఎం తెలిపారు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతి - జనసేన పార్టీ ఎంపీ కుమారుడిపై కేసు