TGSRTC, ఆటోను తప్పించబోయి పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన బస్సు, వీడియో
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణాకు చెందిన బస్సు ఒకటి బీభత్సం సృష్టించింది. ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి పెట్రోలు బంకులోకి దూసుకెళ్లింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి.
హైదరాబాద్ నగర శివారు అబ్దుల్లాపూర్‌మెట్ పరిధిలోని బాటసింగారం వద్ద ఆర్టీసి అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లింది. ఈ బస్సు చౌటుప్పల్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నది. ఈ ఘటనలో పెట్రోల్ పోయించుకునేందుకు బంకు వద్ద ఆగి వున్న కారు పూర్తిగా ధ్వంసమైంది.
ఐతే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు. బస్సు వేగంగా అటువైపు దూసుకొస్తుండటంతో పెట్రోలు బంకులో పనిచేసే సిబ్బంది హాహాకారాలు చేస్తూ పరుగులు తీసారు. అందరూ కాస్త దూరంగా పరుగులు తీయడంతో ప్రాణాలను కాపాడుకోగలిగారు. ఈ ఘటన అంతా అక్కడున్న సీసీ కెమేరాల్లో రికార్డయ్యాయి.
#Hyderabad: A #TGSRTC bus rammed into a petrol pump at #Batasingaram while trying to avoid an auto. A car was destroyed, another vehicle damaged and pump equipment hit. No casualties reported. The incident was captured on #CCTV. @TGSRTCHQ @habeeb_masood pic.twitter.com/OeDykCK9gr
— Deccan Daily (@DailyDeccan) September 10, 2026
