1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Vakiti Srihari Performs CPR on Man Who Collapsed at Assembly

తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో విషాదం.. రాజుకు గుండెపోటు.. ఫలించని సీపీఆర్ (video)

Man
Man
తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో విషాదం చోటుచేసుకుంది. ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్ వ్యక్తిగత కార్యదర్శి రాజు అకస్మాత్తుగా గుండెపోటుకు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ వ్యక్తిగత కార్యదర్శి రాజు ఉన్నట్టుండి అకస్మాత్తుగా కుప్పకూలిపోగా, పశుసంవర్ధక శాఖ మంత్రి వకిటి శ్రీహరి వెంటనే స్పందించి ఆయనకు సీపీఆర్ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. 
 
పరిస్థితిని గమనించిన మంత్రి ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాజుకు సీపీఆర్ నిర్వహించి, ప్రథమ చికిత్స అందించారు. అనంతరం, వైద్య సిబ్బందిని పిలిపించి, అంబులెన్స్ ద్వారా ఆయన్ని వెంటనే ఆసుపత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు. అయితే ఆస్పత్రిలో వైద్యులు పరీక్షించి రాజు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. శాసనసభ ప్రాంగణంలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
పెళ్లి చేసుకోవాల్సిన అన్నయ్య చనిపోయాడు, తమ్ముడు తాళి కట్టాడు, వీడియో