సంబంధిత వార్తలు
- ఆదిపురుష్ నుంచి కృతి సనన్ పోస్టర్, రామ్ సియా రామ్ ఆడియో వచ్చేసింది
- ఎన్‌టి.ఆర్.30 సినిమాలో సైఫ్ అలీఖాన్
- దక్షిణాదిన ఉస్తాద్ భగత్ సింగ్.. బాలీవుడ్లో జాన్వీ కపూర్..?
- జాన్వీ కపూర్‌కు టాలీవుడ్‌లో బంపర్ ఆఫర్స్.. అప్పుడే రెండో ఛాన్స్ వచ్చేసిందా?
- బాయ్‌ఫ్రెండ్‌తో శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్ (video)
అఖిల్ అక్కినేనితో జాన్వీ కపూర్ రొమాన్స్.. ఈ సినిమా అయినా కలిసొస్తుందా?
అక్కినేని అఖిల్‌కు ఏజెంట్ సినిమా అంతగా కలిసిరాలేదు. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో అఖిల్ నిరాశకు గురైనట్లు సమాచారం. అందం, అభినయం వున్నా సక్సెస్ లేకపోవడం అఖిల్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే ఏజెంట్ నిర్మాత అనిల్ సుంకర, బాక్సాఫీస్ వద్ద చిత్రం పేలవమైన ప్రదర్శనకు సంబంధించి క్షమాపణలు చెప్పారు. తాజాగా అఖిల్ అక్కినేనిని సంబంధించిన తాజా అప్డేట్ టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.
సాహో టీమ్‌లలో భాగమైన UV క్రియేషన్స్ ప్రాజెక్ట్‌లో పని చేయడానికి అఖిల్ అక్కినేని చర్చలు జరుపుతున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. ఈ చిత్రంలో అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ రాబోయే చిత్రంలో కథానాయికగా నటిస్తుందని ఇంకా ఆమె పేరు ఖరారు కాలేదని తెలుస్తోంది. ఇది నిజమైతే.. జాన్వీ కపూర్ తెలుగు చిత్రసీమలో ఆమె చేసే రెండో సినిమా ఇదే అవుతుంది.
నిజానికి, జాన్వీ కపూర్ జూనియర్ ఎన్టీఆర్ చిత్రం, #NTR30తో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టనుంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం రెండవ షెడ్యూల్ చిత్రీకరణ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.
తర్వాతి కథనం
