1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Balakrishna green signal to VV Vinayak

16 యేళ్ళ తరువాత బాలయ్యతో వినాయక్...

Balakrishna
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 16 సంవత్సరాల తరువాత ఒక అగ్ర దర్శకుడు, ఒక అగ్రహీరో కలవబోతున్నారు. వారెవరో కాదు సంచలన దర్శకుడిగా పేరొందిన వినాయక్, బాలక్రిష్ణ. ఆది సినిమాతో దర్సకుడిగా మారి ఆ తరువాత ఎన్నో హిట్ సినిమాలు తీసిన వినాయక్ బాలక్రిష్ణతో ఒకే ఒక్క సినిమా తీశారు. అదే చెన్నకేశవరెడ్డి. అప్పట్లో ఈ సినిమా యావరేజ్‌గా ఆడింది. కానీ వీరి కాంబినేషన్ మాత్రం బాగుందని ప్రేక్షకులందరూ మెచ్చుకున్నారు.
 
ప్రస్తుతం బాలక్రిష్ణ ఎన్టీఆర్ బయోపిక్‌లో బిజీగా వున్నారు. ఈ సినిమా డిసెంబర్‌లో పూర్తవుతుంది. ఈ సినిమా తరువాత బాలక్రిష్ణ బోయపాటికి అవకాశమిస్తారని, వీరి కాంబినేషన్లో సినిమా వస్తుందని అందరూ భావించారు. కానీ అది జరుగలేదు. వినాయక్‌తో కలిసి నటించాలన్న నిర్ణయానికి వచ్చేశారట బాలక్రిష్ణ. 
 
గత రెండు రోజుల క్రితం బాలక్రిష్ణ స్వయంగా వినాయక్‌కు ఫోన్ చేసి కథను సిద్ధం చేయమని చెప్పాడట. దీంతో వినాయక్ ఒక మంచి కథను సిద్థం చేస్తున్నాడట. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమాపై అభిమానులు భారీ అంచనాలనే పెట్టుకున్నారు.
About Writer
జె
తర్వాతి కథనం
ఎన్టీఆర్ బయోపిక్ : జయప్రదగా మిల్కీబ్యూటి