మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Modified: గురువారం, 11 అక్టోబరు 2018 (14:20 IST)

పడుకుంటే ఆఫర్... ఫోన్లో డైరెక్టర్... నటి ఏం చేసిందో తెలుసా?(Video)

మీ టూ #Me Too ఉధృతంగా ఒకవైపు సాగుతుండగానే తారలకు చేదు అనుభవాలు మాత్రం ఆగటం లేదు. తాజాగా బాలీవుడ్ డైరెక్టర్ మోడల్, నటి అమన్ సాంధుతో ఫోన్లో తనతో కాంప్రమైజ్ అయితే సినిమా ఛాన్స్ ఇస్తానని చెప్పినట్లు నటి ఆరోపించింది. అంతేకాదు... అతడిని రోడ్డు మీద చొక్కా పట్టుకుని నిలదీసింది. 
 
నాతో ఫోన్లో ఏం చెప్పావు? నాకు సినిమా ఛాన్స్ ఇస్తానన్నావు. అంతవరకూ బాగానే వుంది. ఐతే ఆ ఆఫర్ ఇస్తే నీకు నేను ఆఫర్ ఇవ్వాలా? నీతోనూ నీ నిర్మాతతోనూ నేను కాంప్రమైజ్ కావాలా? నీకు అక్కాచెల్లెళ్లు లేరా? నీకు భార్యాపిల్లలు లేరా? ఏం మాట్లాడవేం... అంటూ అంతా చూస్తుండగానే అతడి చెంపలను వాయించేసింది. 
 
అంతేకాకుండా... ఇలాంటివారు సినిమా ఛాన్సులిస్తామని అమ్మాయిలను మోసం చేస్తున్నారు. జాగ్రత్త అంటూ పిలుపునిచ్చింది. ఆమె చెంపలపై వాయించిన వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. చూడండి ఆ వీడియో...