1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Durbar Heroine Nayanthara fire on AR Murugadoss

ఆ దర్శకుడు మోసం చేశాడంటున్న నయనతార...

Durbar
అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ఉన్న హీరోయిన్లలో నయనతార ఒకరు. ఈమె ఒకవైపు ప్రియుడుతో ప్రేమాయణం కొనసాగిస్తూనే, మరోవైపు వరుస చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన "దర్బార్" చిత్రంలో నటించింది. ఈ చిత్రానికి దర్శకుడు మురుగదాస్. ఈ చిత్రంలోని పాత్రపై ఆమె తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. 
 
12 యేళ్ల క్రితం సూర్య నటించిన చిత్రం గజినీ. ఈ చిత్రంలో తనను మోసం చేసినట్టుగానే ఇపుడు కూడా దర్బార్ చిత్రంలో మరుగదాస్ మోసం చేశారంటూ బోరున విలపిస్తోంది. దర్బార్ చిత్రంలో మెయిన్ హీరోయిన్ నయనతార అయినప్పటికీ రజనీ కుమార్తెగా నటించిన నివాదే థామస్‌కు ఇచ్చిన విలువలో సగం కూడా తనకు ఇవ్వలేదని, తనను ఓ జూనియర్ ఆర్టిస్టుగా చూపించారని ఈమె వాపోతోంది. 
 
ముఖ్యంగా, ఇక నయనతార అభిమానులు సైతం ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలతో తన సత్తాను చాటి, కోట్లాది మంది అభిమానాన్ని పొందిన నయన్, అసలు ఇటువంటి సినిమాను ఎందుకు ఒప్పుకుందని ప్రశ్నిస్తున్న వారూ లేకపోలేదు. 
 
సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చేస్తున్న విమర్శలతో మరింత అశాంతికి గురవుతున్న నయన్, మురుగదాస్ 'గజినీ' సినిమాలో నటించి తప్పు చేసిన తాను, మరోసారి అతని సినిమాలో నటించేందుకు అంగీకరించి, తప్పు చేశానని, అందుకు ప్రతిఫలాన్ని అనుభవిస్తున్నానని అంటోందట.
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
మెగా ఇంటా సంక్రాంతి సంబరాలు... ఒకే ఫ్రేమ్‌లో మెగా హీరోలు