1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Prabhu Deva rushed to hospital due to back injury

వెన్నునొప్పితో విలవిల్లాడుతున్న ''ఇండియన్ మైఖేల్ జాక్సన్''.. ఆస్పత్రిలో అడ్మిట్

ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన 'అభినేత్రి' మూవీ దసరాకు విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ మూవీ విడుదల తర్వాత ప్రభుదేవా తన కొత్త ప్రాజెక్టును ప్రకటించనున్నారని సి

Prabhu Deva
ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన 'అభినేత్రి' మూవీ దసరాకు విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ మూవీ విడుదల తర్వాత ప్రభుదేవా తన కొత్త ప్రాజెక్టును ప్రకటించనున్నారని సినీవర్గాలు అంటున్నాయి. తమన్నా, సోనూసూద్, ప్రభుదేవా లీడ్ రోల్స్‌లో నటించిన అభినేత్రి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ప్రభుదేవా కొత్త మూవీని రెండు భాషల్లో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు టాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. 
 
ఇదిలావుంటే ఈ హీరో ఆస్పత్రిలో చేరారు. అస్వస్థతతో బాధపడుతున్న ఆయనకు మరికొన్ని రోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అభినేత్రి సినిమా షూటింగ్ హిందీ వెర్షన్‌లో ముంబైలో జరుగుతోంది. జూనియర్ ఆర్టిస్టులు, 350 మంది డ్యాన్సర్లతో టైటిల్ సాంగ్‌ను ఇక్కడ చిత్రీకరిస్తున్న నేపథ్యంలో ఆయన ఒక్కసారిగా వెన్నునొప్పితో విలవిల్లాడిపోయారు. 
 
దీంతో అప్రమత్తమైన యూనిట్ సభ్యులు ఆయనను సమీపంలోని ఆస్పత్రికి తరలించామని, కొన్ని రోజులపాటు ప్రభుకు విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పినట్టు నటుడు సోనూసూద్ తెలిపారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని ఆయన తెలిపారు.
తర్వాతి కథనం
'ఐరెన్ లెగ్'తో అల్లు అర్జున్... ఏం జరుగుతుందబ్బా....?